Begin typing your search above and press return to search.

కీర్తిని పెళ్లి చేసుకోబోయే బిజినెస్ మ్యాన్ అతనేనా..?

By:  Tupaki Desk   |   4 April 2020 6:30 AM GMT
కీర్తిని పెళ్లి చేసుకోబోయే బిజినెస్ మ్యాన్ అతనేనా..?
X
'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ నటి కీర్తి సురేష్. అందం, అభినయం రెండు కలగలిపి ఉన్న హీరోయిన్ కీర్తీ సురేష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రంలో ఆమె అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఈ సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అందాల భామ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదనే ప్రచారం నేషనల్ మీడియాలో ఊపందుకొన్నది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని కీర్తి సురేష్ చేసుకోబోతున్న విషయం చర్చనీయాంశంగా మారింది. కెరీర్ ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న సమయంలో కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోవడం ఏమిటనే ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో వస్తున్నాయి.

కేరళ బీజేపీ పార్టీలో కీలకంగా కొనసాగుతున్న ఓ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లికి సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ సంబంధాన్ని ఖాయం చేసే పనిలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారని వార్తలు వచ్చాయి. పెళ్లి కుమారుడి తండ్రితో కీర్తీ తండ్రికి మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండటంతో ఈ పెళ్లి ఖాయమవుందని సినీ, రాజకీయ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారని కొన్ని పత్రికలు రాశాయి. అయితే ఈ బిలియనీర్ పెళ్లికొడుకును కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోబోతుండటం నిజమా కాదా అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. కీర్తీ సురేష్ కూడా ఈ వార్తలపై స్పందించక పోవడంతో పెళ్లి వార్తలు నిజమే అనే విధంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. దీనిపై ఆమె తల్లిదండ్రులు కూడా స్పందించకపోవడంతో ఈ వార్తలకు ఇంకా బలం చేకూరినట్లైంది. కీర్తీ సురేష్ పెళ్లి వార్తలను ఆమె సన్నిహిత వర్గాలు కొట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కెరీర్‌ పైనే దృష్టి సారిస్తున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ చేతి నిండా సినిమాలతో మంచి ఫార్మ్ లో ఉన్న కీర్తి ఇప్పుడే పెళ్లి చేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారట.

కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే చిత్రంలోను, కార్తీక్ సుబ్బరాజు 'పెంగ్విన్', మోహన్‌లాల్ నటిస్తున్న 'మరక్కార్ అరబికదలింటే సింహం', తెలుగులో 'మిస్ ఇండియా', గుడ్ లక్ సఖీ, 'రంగ్ దే' చిత్రాల్లో నటిస్తున్నారు.