Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో మ‌హాన‌టి సంద‌డి

By:  Tupaki Desk   |   13 Aug 2018 5:40 AM GMT
ఆస్ట్రేలియాలో మ‌హాన‌టి సంద‌డి
X
`మ‌హాన‌టి` కిక్కుతో కీర్తి సురేష్ ప‌ర‌ప‌తి ప్ర‌పంచాన్ని చుట్టేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో - అటు త‌మిళ దేశంలో - ఓవ‌ర్సీస్‌ లో ఈ సినిమాకి - కీర్తికి గొప్ప పేరొచ్చింది. మ‌హాన‌టి సావిత్రికి వేరొక ఆల్ట‌ర్నేట్ లేదంటూ కీర్తి సురేష్‌ కి పేరు రావ‌డమే కాదు బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల కుంభ‌వృష్టి కురిసింది. ఇది అరుదైన అస‌మాన‌మైన విజ‌యం. ద‌త్ కాంపౌండ్ అప‌జ‌యాల చ‌రిత్ర‌ను తుత్తునియ‌లు చేస్తూ.. క‌న్నీటిని తుడిచిన విజ‌యం అని చెప్పొచ్చు. మ‌హాన‌టి ముందు - మ‌హాన‌టి త‌ర్వాత అన్న తీరుగా కీర్తి సురేష్ కెరీర్ డిసైడైంది అందుకే.

ఇప్పుడు కీర్తి కోసమే క‌థ‌లు పుడుతున్నాయ్‌. కీర్తి కోస‌మే చెవులు కోసుకుంటున్నారు. కీర్తి కీర్తి అంటూ క‌ల‌వ‌రిస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. కొత్త‌గా వ‌చ్చిన ఇమేజ్‌ కి త‌గ్గ‌ట్టే కీర్తి సురేష్ సైతం ఆచితూచి అడుగులు వేయాల్సొస్తోంది. ఈలోగానే కీర్తి సురేష్ గురించిన ఆస‌క్తిక‌ర వార్త అందింది. ఈ భామ ఆస్ట్రేలియా మెల్‌ బోర్న్‌లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్‌(ఐఐఎఫ్ ఎం 2018) అవార్డు వేడుక‌ల్లో మ‌హాన‌టి చిత్రంలో న‌ట‌న‌కుగానూ పుర‌స్కారం అందుకుంది. నిన్న సాయంత్రం త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌ తో క‌లిసి కీర్తి సురేష్ - నాగ్ అశ్విన్‌ - స్వ‌ప్న‌ద‌త్‌ - ప్రియాంక ద‌త్ అవార్డుల అనంత‌రం పార్టీలో ఫోటోలు దిగారు. ఆ ఫోటోని త‌ర‌ణ్ స్వ‌యంగా ట్విట్ట‌ర్‌ లో షేర్ చేశారు. కీర్తి కెరీర్‌ లో ఇదో అరుదైన ఫీట్‌. మునుముందు మ‌రిన్ని ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాలు ద‌క్కించుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.

త‌దుప‌రి కీర్తి సురేష్‌ న‌టించిన ప‌లు చిత్రాలు క్యూలైన్‌ లో ఉన్నాయి. త‌మిళంలో విశాల్ స‌ర‌స‌న పందెంకోడి 2 - విక్ర‌మ్‌ స‌ర‌స‌న సామి 2 చిత్రాల్లో న‌టిస్తోంది. `పందెంకోడి 2` చిత్రీక‌ర‌ణ పూర్త‌యి రిలీజ్ బ‌రిలోకి వ‌స్తోంది. శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న స‌మంత‌తో క‌లిసి సీమ‌రాజా చిత్రంలోనూ కీర్తి ఆడిపాడుతోంది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ కానుంది.