Begin typing your search above and press return to search.

మహానటి ఎప్పుడూ క్లీన్.. అంతే

By:  Tupaki Desk   |   4 May 2018 4:09 PM GMT
మహానటి ఎప్పుడూ క్లీన్.. అంతే
X
టాలీవుడ్ లో సమ్మర్ సినిమాల బొనాంజా కంటిన్యూ అవుతోంది. వరుసగా క్రేజీ మూవీస్ అన్నీ థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. మరో ఐదు రోజుల్లో రిలీజ్ కానున్న సినిమా మహానటి. సావిత్రి జీవిత కథపై రూపొందిన చిత్రం మహానటి. ఆరంభం నుంచి ఇప్పటివరకూ అన్ని విధాలుగాను ఆసక్తి కలిగిస్తున్న చిత్రం ఇది.

సావిత్రిగా టైటిల్ రోల్ లో కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాకు ఇప్పుడు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. మహానటికి క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను జారీ చేసింది సెన్సార్ బోర్డ్. మూవీలో ప్రతీ సన్నివేశం అద్భుతంగా ఉందని.. ఓ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోతుందని ప్రశంసించారట. సావిత్రి జీవితంలో జనాలకు తెలియని ఎన్నో కోణాలను స్పృశించిన తీరు అధ్భుతం అంటున్నారు. ఈ చిత్రం పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ ను తప్పకుండా మెప్పిస్తుందని అంటున్నారు.

ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ అందడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ కు మహానటి చరిత్రను ఎంతో చక్కగా వర్ణించి చూపనున్నబోతున్నారని తెలుస్తోంది. కీర్తి సురేష్ తో పాటు.. దుల్కర్ సల్మాన్.. సమంత.. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. నాగచైతన్య.. మోహన్ బాబు.. ప్రకాష్ రాజ్ లు కీలక రోల్స్ లో కనిపించనుండగా.. మే నెల 9వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో.. అనేక మంది నటీనటులు క్యామియో రోల్స్ లో నటించారని దర్శకుడు నాగ్ అశ్విన్ చెబుతున్నాడు.