Begin typing your search above and press return to search.

మహానటి మ్యాజిక్ మమూలుగా లేదు

By:  Tupaki Desk   |   25 May 2018 4:57 PM GMT
మహానటి మ్యాజిక్ మమూలుగా లేదు
X
సమ్మర్ లో సినిమాలు కాస్త బావున్నా కూడా ఆడేస్తాయి అని నిర్మాతలు లెక్కలు గట్టిగా వేసుకుంటారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏడాది మొత్తం ఖాళీగా ఉన్న పరవాలేదు గాని సమ్మర్ లో మాత్రం కొంత ఇన్వెస్ట్ చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవలని అనుకుంటారు. అయితే మహానటి నిజంగా ఆ కోరికను నెరవేర్చిందనే చెప్పాలి. క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా మాంచి వసూళ్లను రాబట్టింది.

మే 9న రిలీజ్ అయిన మహానటి 16 రోజుల కలెక్షన్స్ గురించి ఒకసారి చూసుకుంటే.. ప్రతి ఏరియాలో బయ్యర్స్ ని సావిత్రమ్మ కథ కాపాడిందనే చెప్పాలి. పైగా లాభాలు కూడా బాగానే అందుకున్నారు. రంగస్థలం సినిమా తరువాత ఆ స్థాయిలో మంచి వసూళ్లను అందుకున్న సినిమాగా మహానటి నిలిచింది. వరల్డ్ వైడ్ గా 33.23 కోట్లను వసూలు చేసి సమ్మర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు.. అసలు 2018లో రంగస్థలం తరువాత ఆ రేంజులో పెట్టుబడి వర్సెస్ ఆదాయం నిష్పత్తిలో రెండవ అతిపెద్ద హిట్ అనే చెప్పాలి. ఇక చూస్తుంటే నలభై కోట్ల మార్క్ ను సినిమా త్వరలోనే అందుకుంటుందని చెప్పవచ్చు.

ఏరియాల వారిగా 16 రోజులకు గాను మహానటికి వచ్చిన 'షేర్' కలెక్షన్లు

నైజం 9.15 Cr (కోట్లు)
ఉత్తరాంధ్ర 2.85 Cr
సీడెడ్ 1.95 Cr
గుంటూరు 1.59 Cr
కృష్ణ 1.85 Cr
తూర్పు 1.62 Cr
వెస్ట్ 1.15 Cr
నెల్లూరు 0.57 Cr

మొత్తం AP / TG 20.73 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 2.80 Cr
ఓవర్సీస్ 9.70 Cr

వరల్డ్ వైడ్ 30.23 Cr షేర్ సాధించింది.