Begin typing your search above and press return to search.

ఎన్‌.టీ.ఆర్ పై మ‌హాన‌టి ఎఫెక్ట్‌

By:  Tupaki Desk   |   14 May 2018 7:35 AM GMT
ఎన్‌.టీ.ఆర్ పై మ‌హాన‌టి ఎఫెక్ట్‌
X
నంద‌మూరి బాల‌కృష్ణ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని న‌టిస్తూ... నిర్మించాల‌నుకున్న చిత్రం ‘ఎన్‌.టీ.ఆర్‌’. త‌న తండ్రి విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడి జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందించాల‌నుకున్న ఈ సినిమా ప్ర‌కటించిన‌ప్ప‌టి నుంచి టాలీవుడ్ జ‌నాల్లో విప‌రీత‌మైన క్యూరియాసిటీ నెల‌కొల్పింది. అయితే అనుకోకుండా తేజ హ్యాండ్ ఇవ్వ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో ప‌డిపోయాడు బాల‌య్య‌.

‘ఎన్‌.టీ.ఆర్‌’ బ‌యెపిక్ డైరెక్ట‌ర్ ఛెయిర్ నుంచి ఉన్న‌ప‌ళంగా తేజ‌ త‌ప్పుకోవ‌డంతో... స్వ‌యంగా బాల‌కృష్ణే ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నుకున్నాడు. ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేసేందుకు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు సాయం కూడా కోరాడు. అయితే ఈలోపు సావిత్రి బ‌యోపిక్ ‘మ‌హాన‌టి’ విడుద‌ల‌య్యింది. దానికి మాస్- క్లాస్ జ‌నాల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పాత్ర‌ల్లో జీవించిన న‌టీన‌టుల గురించి... పాత్ర‌ల‌కు త‌గిన‌ట్టుగా ఎంచుకున్న కాస్టింగ్ గురించి- అంత‌కు మించి సున్నిత‌మైన క‌థ‌ను అంత‌కంటే సున్నితంగా తెర‌కెక్కించిన‌ ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్ టేకింగ్ చూసి విమ‌ర్శ‌కులు సైతం అభినంద‌న‌ల్లో ముంచెత్తారు. దీంతో బాల‌య్య డిఫెండ్ లో ప‌డిపోయాడు.

బ‌యోపిక్ చిత్రం ఎలా తీయాలో నాగ అశ్విన్ చేసి చూపించాడు. ‘ఎన్‌.టీ.ఆర్‌’ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా... త‌న‌నీ... త‌న ద‌ర్శ‌క‌త్వాన్ని ఓ ఆటాడేసుకుంటారనే విష‌యం బాల‌య్య‌కి త్వ‌ర‌గానే బోధ‌ప‌డింది. అందులోనూ మ‌హాన‌టి సావిత్రి జీవితంలోలాగే నంద‌మూరి తార‌క రాముడి జీవితంలోనూ చీక‌టి రోజులున్నాయి. వాటిని చూపించ‌డం క‌త్తి మీద సాము లాంటిది. దాంతో త‌న తండ్రి బ‌యోపిక్ చిత్రాన్ని బాల‌య్య ప‌క్క‌న పెట్టేశాడు. వ‌చ్చే నెల‌లో మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొద‌లెట్ట‌బోతున్నాడు. దీంతో ప్ర‌తిష్టాత్మక బ‌యోపిక్ ఎప్పుడు వ‌స్తుందో... ప్ర‌స్తుతానికి సస్పెన్స్.