Begin typing your search above and press return to search.
చిరంజీవి చెల్లెలుగా మహానటి ఫిక్స్..?
By: Tupaki Desk | 6 Aug 2021 12:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి మలయాళ 'లూసిఫర్' తోపాటుగా తమిళ 'వేదాళం' చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన కమర్షియల్ సినిమా. మెహర్ ఈ స్క్రిప్ట్ మీద దాదాపు మూడేళ్ళుగా వర్క్ చేసి, చిరు ఇమేజ్ కు తగినట్లు కొన్ని మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
'వేదాళం' రీమేక్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ వచ్చినప్పటి నుంచే ఇందులో చిరు సోదరి పాత్రలో నటించే హీరోయిన్ గురించి చర్చలు జరిగాయి. అందులోను సాయి పల్లవి - కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కీర్తి సురేష్ అయితేనే మెగాస్టార్ సిస్టర్ రోల్ కి బాగుంటుందని భావించిన మెహర్ రమేష్.. ఏడెనిమిది నెలలుగా ఆమెను ఒప్పించడానికి ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు 'మహానటి' హీరోయిన్ ని ఒప్పించగలిగారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీని కోసం అమ్మడు భారీ రెమ్యూనరేషన్ అందుకోనుందని అంటున్నారు.
'వేదాళం' ఒరిజినల్ వెర్సన్ లో అజిత్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తే.. చెల్లెలుగా లక్ష్మీ మీనన్ కనిపించింది. ఇప్పుడు మెగా రీమేక్ లో లక్ష్మీ మీనన్ పాత్రలో కీర్తి కనిపించనుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కీర్తి సురేష్ ఇప్పటికే 'అన్నాత్తే' చిత్రంలో రజినీకాంత్ కూతురిగా నటిస్తోందని టాక్ ఉంది. ఇక తెలుగులో మహేష్ బాబు - పరశురామ్ పెట్లా కాంబోలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో కీర్తి హీరోయిన్ గా చేస్తోంది.
ఇదిలా ఉంటే 'ఆచార్య' సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్ కు మొదలు పెట్టడానికి సన్నాహాలు చూస్తున్నారు. ఇదే క్రమంలో నవంబర్ నుంచి 'వేదాళం' చిత్రాన్ని స్టార్ట్ చేసి రెండు రీమేక్ లను సమాంతరంగా షూట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న దీనిపై ఓ క్లారిటీ రావొచ్చు. అలానే 'ఆచార్య' విడుదల తేదీ ప్రకటన కూడా ఉండొచ్చు.
ఇకపోతే 'శక్తి' 'షాడో' వంటి డిజాస్టర్స్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మెహర్ రమేష్ చేయబోయే చిరంజీవి సినిమాపై అందరి దృష్టి ఉంది. మరి మెగా రీమేక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మెహర్ ప్లాప్ దర్శకుడనే ముద్ర తొలగించుకుంటాడేమో చూడాలి.