Begin typing your search above and press return to search.

మహానటి రేటు కుదిరింది

By:  Tupaki Desk   |   3 Jun 2018 7:55 AM GMT
మహానటి రేటు కుదిరింది
X
కొన్నిసార్లు ఆలస్యం చేయటం కూడా మంచి చేస్తుంది. మహానటి విషయంలో అది అక్షరాలా రుజువయ్యింది. విడుదలకు ముందే శాటిలైట్ అమ్మేద్దాం అనుకున్న వైజయంతి సంస్థ ఆశించిన ధర రాకపోవడంతో అది పెండింగ్ లో పెట్టేసి విడుదల చేసింది. కానీ అనూహ్యంగా ఊహకందని రేంజ్ లో మహానటి ఘనవిజయం సాధించడంతో ఛానల్స్ మధ్య పోటీ పెరిగింది. మేమంటే మేమంటూ కాస్త గట్టి పోటీనే జరిగింది. కానీ చివరికి రేస్ లో స్టార్ మా గెలిచినట్టు సమాచారం. డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ తీసేసుకోగా శాటిలైట్ రైట్స్ స్టార్ మాకు దక్కాయి. మొత్తంగా 15 కోట్ల దాకా డీల్ ఫైనల్ అయినట్టు సమాచారం. ఇది విడుదలకు ముందు అనుకున్న దాని కన్నా ఐదు కోట్లు ఎక్కువే అని చెప్పాలి. రిజల్ట్ చూసాక డిమాండ్ పెరిగింది. జీ తెలుగు సైతం తీవ్రంగా పోటీ పడినప్పటికీ బడ్జెట్ దాటిపోవడంతో డ్రాప్ అయినట్టు సమాచారం. ఏరకంగా చూసుకున్నా ,మహానటి బడ్జెట్ కు ఇది చాలా మంచి మొత్తం.

అమెజాన్ కూడా మంచి ఆఫర్ తోనే హక్కులు తీసుకున్నట్టు తెలిసింది. కానీ ఎంత వ్యవధిలో దాన్ని ఆన్ లైన్ లో విడుదల చేస్తారు అనే క్లారిటీ ఇంకా రావలసి ఉంది. రంగస్థలం 45వ రోజు భరత్ అనే నేను 51వ రోజు ఇలా క్లియర్ గా డెడ్ లైన్ పెట్టుకుని మరీ సినిమాలు వదులుతున్న అమెజాన్ మహానటిని కూడా అర్ధశతదినోత్సవం లోపే వదిలేలా ఉంది. కీర్తి సురేష్-దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ఈ మూవీ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఒకదానికొకదాటి వరసగా నిరాశ పరచడంతో కాస్త పలుచబడిన మహానటి మళ్ళి పికప్ అయిపోయింది. పెట్టిన పెట్టుబడి- అమ్మిన రేట్లు- వచ్చిన వసూళ్లు- హక్కుల రూపంలో దక్కిన మొత్తం ఇవన్నీ లెక్క చూసుకుంటే మహానటి బ్లాక్ బస్టర్ స్టేటస్ దాటేసినట్టే.