Begin typing your search above and press return to search.

'మహానటి' కి మరో అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   31 Oct 2018 4:57 PM GMT
మహానటి కి మరో అరుదైన గౌరవం
X
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మహానటిగా గుర్తింపు దక్కించుకున్న సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన ‘మహానటి’ చిత్రం కలెక్షన్స్‌ పరంగా పలు రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సౌత్‌ లో ఇప్పటి వరకు ఏ బయోపిక్‌ కూడా సాధించని భారీ వసూళ్లను మహానటి దక్కించుకుంది. ఇంకా పలు అవార్డులను మరియు రివార్డులను కూడా దక్కించుకున్న మహానటి తాజాగా మరో అరుదైన గౌరవంను దక్కించుకుంది.

వచ్చే నెలలో గోవాలో జరుగబోతున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రదర్శించేందుకు ఎంపిక అయ్యింది. పలు అంతర్జాతీయ సినిమాలు ఈ ఫెస్టివల్‌ లో ప్రదర్శణ కాబోతున్న నేపథ్యంలో మహానటి కూడా అందులో భాగం కావడం పెద్ద గౌరవంగా చెప్పుకోవాలి. మహానటి తో పాటు బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయిన ‘పద్మావత్‌’ చిత్రాన్ని కూడా ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్నారు.

49వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఇండియన్‌ పనోరమ ఫిల్మ్‌ కేటగిరిలో మహానటి, పద్మావత్‌ చిత్రాలను ప్రదర్శణకు ఉంచబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. హిందీ, తమిళం, మలయాళం ఇంకా పలు భాషలకు చెందిన 22 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ను ఈ ఫెస్టివల్‌ లో ప్రదర్శణకు ఉంచబోతున్నారు. సౌత్‌ నుండి కేవలం మహానటి చిత్రానికే ఈ గౌరవం దక్కుతున్నట్లుగా వైజయంతి మూవీ మేకర్స్‌ వారు అంటున్నారు.

మెయిన్‌ స్ట్రీమ్‌ లో భాగంగా ఇండియాకు చెందిన నాలుగు సినిమాలు పద్మావత్‌, మహానటి, రాజీ, టైగర్‌ జిందా లు మాత్రమే ప్రదర్శణకు ఉండబోతున్నాయి. నవంబర్‌ 20 నుండి 28 వరకు ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ను నిర్వహించబోతున్నారు. ప్రపంచ నలుమూల నుండి ఫిల్మ్‌ మేకర్స్‌ రాబోతున్నారు.