Begin typing your search above and press return to search.

మహానటి స్టైల్ లోనే ఎన్టీఆర్?

By:  Tupaki Desk   |   24 Dec 2018 1:08 PM GMT
మహానటి స్టైల్ లోనే ఎన్టీఆర్?
X
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు జనవరి 9 అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన కథానాయకుడి విశ్వరూపాన్ని చూసేందుకు తహతహలాడుతున్నారు. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. సినిమాలో ఏం ఉంటాయో అనే దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ఇకపోతే విశ్వసనీయ వర్గాల ద్వారా ఎన్టీఆర్ కథానాయకుడులోని బిగినింగ్ సీన్ ఇదే నంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఎన్టీఆర్ ఓపెనింగ్ షాట్ హాస్పిటల్ లో మొదలవుతుందట. బసవతారకం చివరి దశలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఎన్టీఆర్ ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడట.

బాల్యం నుంచి యవ్వనం దాకా అలా చూపిస్తూ సినిమా జీవితాన్ని మొదటి అరగంట తర్వాత మొదలుపెట్టేస్తారట. అయితే ఓపెనింగ్ ట్రాక్ గా చెప్పబడుతున్న ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని సమాచారం. ముందు నుంచి ఎన్టీఆర్ కు మహానటికి పోలికలు వస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని బలపరించేందుకు అన్నట్టు అందులో సావిత్రి గారిని హాస్పిటల్ కు తీసుకెళ్లే సీన్ తరహాలోనే ఇందులో బసవతారకం గారిది పెట్టడం కాకతాళీయమో లేక అది అందులో బాగా వర్క్ అవుట్ అయ్యింది కాబట్టి స్ఫూర్తి చెందారేమో చెప్పలేం.

మొత్తానికి కథానాయకుడుకి సంబంధించిన ఒక్కో న్యూస్ మంచి ఆసక్తి రేపెలా ఉన్నాయి. జనవరి 9న విడుదల కోసం ఇప్పటికీ థియేటర్లను ఫైనల్ చేయడం కూడా పూర్తయిపోయింది. ఓవర్సీస్ లో లిస్ట్ ప్రకటించడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలుపెట్టేసారు. సంక్రాంతి రేస్ లో ముందు వస్తున్న ఎన్టీఆర్ మీద అంచనాలు అయితే భారీగా ఉన్నాయి