Begin typing your search above and press return to search.
క్లాసు మాసు ఎవరు కరెక్ట్ బాసూ
By: Tupaki Desk | 13 May 2018 7:37 AM GMT సాధారణంగా ఏ బాషా సినిమా పరిశ్రమలో అయినా సినిమా చూసే ప్రేక్షకులను రెండు వర్గాలుగా విభజిస్తారు. క్లాస్ అండ్ మాస్ అని. హీరోయిజం ఎలివేట్ చేస్తూ మసాలా అంశాలకు కొదవ లేకుండా చూసుకునే వాటిని మాస్ గా, సున్నితమైన అంశాలతో చక్కని ఆరోగ్యకరమైన హాస్యాన్ని కాని ఎమోషన్స్ ని కాని చూపించే వాటిని క్లాస్ గానూ పరిగణిస్తూ ట్రేడ్ లో ఇలాంటి పదజాలం వాడటం సహజం. ఇది క్లాస్ సినిమా కాబట్టి బిసి సెంటర్స్ లో ఆడదు అంటూ లేదు ఇది ఊర మాస్ సినిమా కాబట్టి ఎ సెంటర్స్ లో పోదు అంటూ రకరకాల ఉపమానాలు ఇస్తూ ఉంటారు. ట్రేడ్ పరంగా ఈ లెక్కలు సహజమే. పెళ్లి చూపులు సినిమా పై సెంటర్స్ లో ఆడినంతగా సి సెంటర్స్ లో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. బాలకృష్ణ నటించిన డిక్టేటర్-జైసింహ లాంటి సినిమాలు బిసి సెంటర్స్ లో తెచ్చుకున్నంత రెస్పాన్స్ హైదరాబాద్ లాంటి నగరాల్లో తెచ్చుకోలేదు.అలా అని ఒకచోట ఆడి ఒక చోట ఆడనంత మాత్రాన వాటిని బాగున్నయనో లేక బాగాలేవనో చెప్పలేం. కంటెంట్ ను బట్టి ఒకోసారి కొన్ని వర్గాలకే పరిమితం కావాల్సి ఉంటుంది.
ఇక మహానటి విషయంలో ఈ లెక్కలు వచ్చాయి కాని ఇది మాత్రం వాటికి అతీతంగా అన్ని సెంటర్స్ లోను యునానిమస్ గా టాక్ తెచ్చుకోవడం గమనించాల్సిన అంశం. సావిత్రి గారి జీవిత కథ గురించి ఇప్పటి తరానికి ఆసక్తి ఉండటంతో పాటు ఆవిడ మీద గౌరవం ఉన్న అధిక శాతం ప్రజానీకం సినిమా చూసేందుకు ఆసక్తి చూపడంతో ఓవర్సీస్ మొదలుకుని ఇక్కడి సి సెంటర్స్ దాకా ఒకే తరహా స్పందన కనిపిస్తుంది. కాని క్లాస్ మాస్ అనేది ప్రేక్షకులకు సంబంధించింది కాదు. నిజానికి సినిమాకు సంబంధించింది. జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ తో చేసిన నాన్నకు ప్రేమతో బిసి సెంటర్స్ లో డీసెంట్ రన్ రాగా కొరటాల శివతో చేసిన జనతా గ్యారేజ్ మాత్రం దానికి నాలుగింతలు ఎక్కువ రాబట్టింది. రెండు సినిమాల్లో హీరో ఒక్కడే. జానర్ వేరు. అందుకే రిజల్ట్ కూడా వేరుగా వచ్చింది. ఇక ట్రేడ్ కూడా విభజనను బిజినెస్ కోణంలో చూస్తుందే తప్ప ఎక్కడ ఈ సినిమాను రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద కాదు. నలభై ఏళ్ళ క్రితం శంకరాభరణం సినిమాలో సాహిత్యం అర్థం కాకపోయినా సినిమాలో ఆత్మను మెచ్చిన ప్రేక్షకులు క్లాస్ మాస్ తేడా లేకుండా బ్రహ్మరధం పట్టారు. ఆ రోజులు ఇప్పుడు కావు కాని కంటెంట్ ఉంటే భేదం లేకుండా పట్టం కడతామని మహానటితో ఋజువు చేస్తున్నారు ప్రేక్షకులు.