Begin typing your search above and press return to search.

మహానటితో మెగాస్టార్ : ఫోటో టాక్

By:  Tupaki Desk   |   16 Aug 2019 11:09 AM IST
మహానటితో మెగాస్టార్ : ఫోటో టాక్
X
ఖతార్ లో జరుగుతున్న సైమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. టాలీవుడ్ నుంచి శాండల్ వుడ్ దాకా తారలందరూ తరలిరాగా చూసేందుకు రెండు కళ్ళు చాలలేదంటే అతిశయోక్తి కాదు. అంధులనూ మరోసారి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు చిన్నపిల్లల్లా సంబరపడుతూ చిరుతో కొన్ని మూమెంట్స్ ని షేర్ చేసుకునేందుకు పోటీ పడటం అసలు హై లైట్ గా నిలిచింది.

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ చిరుతో ముచ్చట్లు చెబుతున్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. చిరు కుర్ఛీలో ఉండగా ఆయనకు గౌరవం ఇస్తూ మోకాలి మీద కూర్చుని కీర్తి ఆయనతో మాట్లాడుతున్న ఫోటో ఇద్దరు అభిమానులకు మంచి ఉత్సాహాన్ని కలగజేస్తోంది. కీర్తి సురేష్ తో మెగా బాండింగ్ ఈనాటిది కాదు. చిరు కెరీర్ ప్రారంభంలో నెగటివ్ రోల్ పరంగా చాలా గొప్ప పేరు తెచ్చిన పున్నమినాగులో నటించిన మేనక అప్పట్లో తమిళ్ టాప్ హీరోయిన్.

ఆ తర్వాత ఈ కాంబో మళ్ళీ సాధ్యపడలేదు కానీ ఆ సినిమా తాలూకు జ్ఞాపకాలు మాత్రం అలా నిలిచిపోయాయి. అందుకే మేనక అన్నా కీర్తి అన్నా చిరుకు ప్రత్యేకమైన అభిమానం. కీర్తి సురేష్ సైతం తన తల్లితో నటించిన హీరో అందులోనూ టాలీవుడ్ మెగాస్టార్ తనను తన నటన గురించి అంత ప్రత్యేకంగా పొగుడుతూ ఉంటే అంతకన్నా ఛీర్ఫుల్ మూమెంట్ ఇంకేముంటుంది.