Begin typing your search above and press return to search.
ఈ టాక్ చూస్తుంటే పూరీకి హడలే
By: Tupaki Desk | 9 May 2018 5:14 PM GMTకీర్తిసురేష్ లీడ్ రోల్ లో.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ మహానటి. సావిత్రి జీవితంపై సినిమా అంటే.. సాధ్యమేనా అంటూ మొదట అందరూ ఆశ్చర్యపోయారు. క్యాస్టింగ్.. సినిమా సంగతులు తెలిసి కొందరు పెదవి విరిచినా.. యూనిట్ పడుతున్న శ్రమ చూసి ఇదేమీ తీసిపారేయదగ్గట్లుగా ఉండదులే అనుకున్నారు.
కానీ మహానటి మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలోనే కాదు.. బహుశా వెబ్ మీడియా అనేది మొదలైన తర్వాత.. ఏ సినిమాకు దక్కని రేంజ్ లో రివ్యూలు.. రేటింగులు వచ్చాయి. జనాల నుంచి వస్తున్న టాక్ ప్రకారం అయితే.. మహానటికి బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోవచ్చు. ఇలాంటి సమయంలో.. ఈ సినిమాకు జస్ట్ రెండు రోజుల గ్యాప్ లో వస్తున్న సినిమా మెహబూబా. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. పెద్దగా ప్రమోషన్లు లేకుండానే వచ్చేస్తోంది.
కంటెంటే మాట్లాడేస్తుందిలే అనుకునే రోజులు కావు ఇవి. ముందు ఆడియన్స్ లోకి వెళితేనే.. సినిమా థియేటర్లలో నిలబడుతుంది. పైగా పునర్జన్మల కాన్సెప్ట్ అంటూ.. అప్పుడే మగధీరతో పోలికలు తెచ్చేసుకున్నాడు. మహానటికి ఈ స్థాయికి సక్సెస్ ను బహుశా ఆ సినిమా మేకర్సే ఊహించి ఉండరు. ఇక పూరీ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తాడు చెప్పండి. ఒక రకంగా ఇది మెహబూబా మూవీని మహానటి టెన్షన్ పెట్టేసినట్లుగా అయింది. అసలే అవుటాఫ్ ఫామ్ అన్నట్లుగా ఉన్న పూరీ.. కేవలం కంటెంట్ తో.. కొత్త హీరో(టీనేజ్ లో చేసినది మినహాయిస్తే) హీరోయిన్లతో ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.