Begin typing your search above and press return to search.

సావిత్రి గారిని దించేసారే - టీజర్ టాక్

By:  Tupaki Desk   |   14 April 2018 1:31 PM GMT
సావిత్రి గారిని దించేసారే - టీజర్ టాక్
X
టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ లిస్టులో ఉన్న మహానటి టీజర్ విడుదలయ్యింది. ఎక్కువ కథ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చూపించినవి కొన్ని షాట్స్ అయినప్పటికీ క్వాలిటీ విషయంలో మాత్రం దర్శకుడు నాగ అశ్విన్ ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అర్థమవుతోంది. అనగనగా ఒక మహానటి అంటూ ఒత్తి ఒత్తి పలుకుతూ ఒక వాయిస్ ఓవర్ విన్పిస్తుండగా సమంతా ఎవరినో ఆశ్చర్యంతో చూస్తున్నట్టు చూపించి విజయ్ దేవరకొండ తన కొలీగ్ గా ఏదో చెప్పబోతున్నట్టు ఒక షాట్ లో చూపించారు. బహుశా ఇది మధురవాణి పాత్రలో జర్నలిస్ట్ గా నటించిన సమంతా సావిత్రి గారి ఆత్మకథను మనకు చెబుతూ టైపు చేయటం కాబోలు టీజర్ బిగినింగ్ అలాగే ఉంది. ఇక సావిత్రి గారిలా కీర్తి సురేష్ ని పరకాయ ప్రవేశం చేయించాడు నాగ అశ్విన్. తన పాత సినిమాలలోని కొన్ని బిట్స్ ని యధాతధంగా తీసిన అశ్విన్ సావిత్రి గారిని రీ క్రియేట్ చేసినట్టే ఉంది.

సావిత్రి గారి లైఫ్ స్టైల్-జెమిని గణేషన్ తో ఆవిడ వైవాహిక జీవితం-సంతానం కలిగినప్పుడు ఇద్దరి ఆనందాన్ని చూపించడం ఇలా మొత్తం చాలా వెనక్కు తీసుకెళ్ళిపోయాడు దర్శకుడు. డాక్టర్ చక్రవర్తి రిలీజ్ అయినప్పుడు టికెట్లు దొరక్క ప్రేక్షకులు వెనక్కు వెళ్లడాన్ని కూడా ఒక షాట్ లో చూపించిన అశ్విన్ సావిత్రి గారి వైభవం ఆ రోజుల్లో ఎంత దివ్యంగా ఉండేదో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. మిక్కి జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ కూడా చక్కగా అమరింది. మరి సావిత్రి గారి జీవిత చరమాంకం ఇందులో ఉంటుందో లేదో చూచాయగా కూడా చూపించలేదు. బహుశా ట్రైలర్ లో ఏదైనా క్లూ ఇవ్వొచ్చు. మోహన్ బాబు-ప్రకాష్ రాజ్-నాగ చైతన్య ఇంకా మిగిలిన నటీనటుల పాత్రలు ఏవి రివీల్ చేయలేదు. మొత్తానికి ఉన్న ఆసక్తిని టీజర్ రెట్టింపు చేసిందనే చెప్పాలి.







Clicke Here For Trailer : https://www.youtube.com/watch?v=OrnYMmWBuV4