Begin typing your search above and press return to search.
నా దారి నాదే -దుల్కర్
By: Tupaki Desk | 14 May 2018 4:39 AM GMTఒక గొప్ప నటుడు.. స్టార్ హీరో కొడుకుగా ఉండటం ఏ హీరోకయినా గ్యారంటీగా ప్లస్ పాయింటే. తండ్రి చూపిన బాటలో ఈజీగా స్టార్ డమ్ సంపాదించవచ్చు. కొత్త రూట్ లో.. కొత్తగా ప్రయత్నించడమంటే సాహసమే. కష్టమైనా అదే బాటలో వెళ్తానంటున్నాడు టాలీవుడ్ లో అడుగుపెట్టిన మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.
మళయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి కొడుగ్గా సినిమాల్లోకి అడుగుపెట్టినా దుల్కర్ డిఫరెంట్ పాత్రలతో అభిమానులను మెప్పించాడు. తొలిసారిగా మహానటి సినిమాలో జెమినీ గణేశన్ పాత్రను చేసి సూపర్ అనిపించుకున్నాడు. ఈ సినిమా కోసం దుల్కర్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. తమిళ సినిమాల్లో నటించడం అలవాటయినందున తమిళ వెర్షన్ కు డబ్బింగ్ ఈజీగా చెప్పగలిగినా తెలుగుకు మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందంటున్నాడు. ‘‘తమిళంతో పోలిస్తే తెలుగులో డైలాగులు చెప్పడం ఓ రకంగా ఛాలెంజే. నేను చెప్పే డైలాగుల అర్ధం తెలుసుకుని.. వాటిని బాగా ప్రాక్టీస్ చేశాకే డబ్బింగ్ చెప్పా. లేకపోతే ఇక్కడి ప్రేక్షకులు నన్నెలా అభిమానిస్తారు? ఎవరూ తిట్టుకోకూడదనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే డైలాగులు చెప్పా’’ అంటూ తెరవెనుక పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చాడు దుల్కర్.
తండ్రి ముమ్మట్టితో కలిసి సినిమా నటించే ఆలోచన ప్రస్తుతానికి లేదంటున్నాడు దుల్కర్. ఇప్పటికే చాలామంది ఈ ఆఫర్ ఇచ్చారని... కానీ అదంత మంచి ఆలోచన కాదంటున్నాడు. దీనివల్ల లేనిపోని పోలికలు రావడం తప్ప ఉపయోగం ఉండదని.. అందుకే ఆ ఆఫర్లు ఏవీ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు. తండ్రితో కలిసి నటించాల్సిన అవసరాన్ని స్క్రిప్టు డిమాండ్ చేయాలి తప్ప... దానికోసం స్క్రిప్ట్ రాయడం అనే ఐడియా కరెక్ట్ కాదన్నది దుల్కర్ మాట.