Begin typing your search above and press return to search.

మహానాయకుడికి పెద్ద చిక్కే వచ్చింది!!

By:  Tupaki Desk   |   31 Oct 2018 4:49 PM GMT
మహానాయకుడికి పెద్ద చిక్కే వచ్చింది!!
X
ఎన్టీఆర్ బయోపిక్ గా ఇప్పటికే కావలసినంత క్రేజ్ మూటగట్టుకున్న బాలయ్య కొత్త సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కథానాయకుడు జనవరి 9న మహానాయకుడు జనవరి 24న విడుదల చేయనున్నట్టు పోస్టర్స్ లో కూడా గతంలోనే స్పష్టం చేసారు. కానీ ఇప్పుడు దీని విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. 24న వచ్చే సీక్వెల్ కు కేవలం రెండు వారాలు మాత్రమే గ్యాప్ ఉండటం వల్ల అప్పటికి విజయవంతంగా ఆడుతున్న కథానాయకుడిని తీసేసి దీన్ని వేస్తే ఒకదాని మీద మరొకదాన్ని ప్రభావం ఉంటుంది కాబట్టి కనీసం నెల రోజుల గ్యాప్ ఉండేలా చూడమని నందమూరి అభిమానుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని సమాచారం.

ముందు అనుకున్న తేదీలకే కట్టుబడి ఉండాలని క్రిష్ గట్టిగా ఫిక్స్ అయినప్పటికీ టీమ్ తో కలిసి ఈ విషయం గురించి సీరియస్ గానే చర్చిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన క్లారిటీ రావడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. ఎలాగూ రెండున్నర నెలల సమయం ఉంది కాబట్టి ఈ లోపు జనవరిలో విడుదల కానున్న భారీ సినిమాల విడుదల తేదీలు వాటి మార్పులు గమనించి దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. మహానటి సక్సెస్ అయినప్పుడు ఈజీగా 30 రోజుల దాకా సక్సెస్ ఫుల్ రన్ దక్కించుకుంది. ఆ తర్వాత నెమ్మదించింది.

కానీ కథానాయకుడికి ఆ ఛాన్స్ ఉండదు. రెండో భాగం వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మొదటి భాగం మీద ఆసక్తి తగ్గడమే కాదు అది వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. ఈ ఇబ్బంది ఎందుకులెమ్మని ఫిబ్రవరి వచ్చే ఆలోచన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎన్టీఆర్ సస్పెన్స్ తేలాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు