Begin typing your search above and press return to search.

రేపటి నుంచి సినిమా హాల్స్.. సర్కార్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   4 Nov 2020 4:30 PM GMT
రేపటి నుంచి సినిమా హాల్స్.. సర్కార్ కీలక నిర్ణయం
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సినీ పరిశ్రమ, అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కేంద్రం నిబంధనలు సడలించినా ఇంకా రాష్ట్రాలు మాత్రం సినీ పరిశ్రమపై నిషేధాజ్ఞలు కొనసాగించాయి. తాజాగా వాటిని ఎత్తివేస్తున్నాయి.

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి సినిమా హాల్స్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఇవాళ అధికారికంగా ప్రకటన జారీ చేసింది.

50శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు మహారాష్ట్ర సర్కార్ అనుమతిచ్చింది. కేంద్రం విడుదల చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాల ప్రకారం సినిమా థియేటర్లకు అనుమతులు ఇస్తున్నట్టు తెలిపింది.

కాగా దేశ సినీ పరిశ్రమకు ముంబై కేంద్రం. బాలీవుడ్ అడ్డాగా అది. అందుకే మహారాష్ట్రలో సినిమా థియేటర్లు ఓపెన్ అయితే ఇక బాలీవుడ్ లో జోష్ నిండుతుంది. సినిమాలు విడుదల అవుతాయి. మిగతా రాష్ట్రాల్లోనూ థియేటర్లు ఓపెన్ అయ్యి సినిమాలు ఆడితే పాత రోజులు మళ్లీ రావచ్చు. తద్వారా సినీ పరిశ్రమ దానికి అనుబంధంగా ఉన్న ఎంతో మందికి ఉపాధి దక్కుతుంది. ప్రేక్షకులకు వినోదం దక్కుతుంది.