Begin typing your search above and press return to search.

కంగనా పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై ప్రభుత్వ దర్యాప్తు...!

By:  Tupaki Desk   |   11 Sep 2020 1:31 PM GMT
కంగనా పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై ప్రభుత్వ దర్యాప్తు...!
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ - మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. కంగన ముంబైని పీవోకేతో పోల్చడం.. ముంబై పోలీసులపై నమ్మకం లేదని వ్యాఖ్యానించడంతో శివసేన - కంగనాల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఈ క్రమంలో కంగనా కార్యాలయాన్ని అక్రమ నిర్మాణమంటూ మహా ప్రభుత్వం కూల్చివేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై అలాగే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే పై కంగనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె విషయంలో ముందుకే వెళుతోందని అర్థం అవుతోంది. గతంలో కంగనాపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు మహా ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు ఇప్పటికే ముంబై పోలీసులను దర్యాప్తు చేయమని కోరినట్లు తెలుస్తోంది. నిషేధిత పదార్థాలు - నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ ను కంగనా వాడతారనే ఆరోపణలను నిగ్గు తేల్చాల్సిందిగా ముంబై పోలీసులకు ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసిందని సమాచారం.

కాగా, బాలీవుడ్ నటుడు అధ్యయన్‌ సుమన్‌ 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌ పై పలు ఆరోపణలు చేశారు. 'కంగనా రనౌత్‌ కొకైన్‌ వాడతారని.. తనను కూడా డ్రగ్స్ తీసుకోవాలని కోరారని' సుమన్‌ సంచలన ఆరోపణలు చేశారు. దీని ఆధారంగా కంగనాకు డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కంగనా ఘాటుగా స్పందిస్తూ.. 'తాను డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిరూపించాలని.. డ్రగ్స్‌ టెస్ట్‌ కు తాను సిద్ధంగా ఉన్నానని.. తనకు డ్రగ్‌ మాఫియాతో లింకులు ఉన్నాయని రుజువైతే ముంబైలో ఎప్పుడూ అడుగుపెట్టబోనని' ట్వీట్‌ చేశారు. అయితే ఇప్పుడు కంగనా డ్రగ్స్ వ్యవహారంపై విచారణ జరిపి నిజాలు రాబట్టాల్సిందిగా మహా ప్రభుత్వం కోరడంతో ముంబై పోలీసులు అందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే సిట్‌ తో విచారణ జరిపించాలా? లేక నార్కోటిక్స్‌ కంట్రోల్ బోర్డుతో దర్యాప్తు చేపించాలా అని ముంబై పోలీసులు ఆలోచిస్తున్నారట. మరి దీనిపై కంగనా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.