Begin typing your search above and press return to search.
దేవదాసు బాకీలకు మహర్షి హామీ
By: Tupaki Desk | 30 April 2019 1:21 PM GMTమహర్షి సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న అశ్విని దత్ గతంలో దేవదాస్ సినిమాకు గాను చెల్లించాల్సిన బకాయిల గురించి ఇప్పటికే అంతర్లీనంగా పెద్ద రచ్చే జరుగుతోంది. ఒకవైపు నైజాంలో సునీల్ పట్టు బిగించి ఏకంగా చాంబర్ లో ఫిర్యాదు చేసే దాకా వెళ్ళిపోగా మరోవైపు గోదావరి జిల్లాలో ఇది క్లియర్ చేస్తేనే మహర్షిని విడుదల చేయాలని లేదంటే ఆపాలని నిర్ణయించుకున్నట్టుగా వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి.
రిలీజ్ కు కేవలం 8 రోజుల ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం కోట్లాది పెట్టుబడులతో రిస్క్ చేస్తున్న మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు క్షేమం కాదు. అందుకే దిల్ రాజు చొరవ తీసుకున్నారో లేక పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకున్నారో కాని మొత్తానికి దత్తు ఆయన కూతురు స్వప్న నుంచి సదరు బాకీ తీర్చాల్సిన వాళ్ళకు రేపు హైదరాబాద్ లో మీటింగ్ కోసం రమ్మని కబురు వెళ్లిందట
రేపు ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడాల్సిందే. పైగా సాయంత్రమే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. ఆ లోపే ఇదంతా ఓ కొలిక్కి వచ్చేయాలి. ఈ వివాదం కారణంగానే కొన్ని ఏరియాలలో ధియేటర్లు కన్ఫర్మ్ కాక అడ్వాన్సు బుకింగ్ ఇవ్వలేకపోతున్నట్టు సమాచారం. రేపు దత్తు స్వప్నలు కలిసి గట్టి హామే ఇవ్వబోతున్నట్టు తెలిసింది.
ఎలాగూ మహర్షిలో పార్ట్ నర్ కాబట్టి అందులో వచ్చే లాభాలకు షేర్ ఇస్తానని చెప్పొచ్చు. లేదా గ్యారెంటీ కింద చెక్ లేదా బాండ్ ఇవ్వొచ్చు. ఇదంతా అఫీషియల్ గా జరిగే వ్యవహారం కాదు కాబట్టి నిజమో కాదో కూడా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి తనకు ఏ మాత్రం సంబంధం లేని దేవదాస్ వల్ల మహర్షి కి ఎఫెక్ట్ పడటం విచిత్రమే. పరిశ్రమలో పెట్టుబడుల ప్రహసనాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ కావాలా