Begin typing your search above and press return to search.

ఓవరాల్‌ గా ‘మహర్షి’ ఆడియోకు ఎన్ని మార్కులు?

By:  Tupaki Desk   |   29 April 2019 1:50 AM GMT
ఓవరాల్‌ గా ‘మహర్షి’ ఆడియోకు ఎన్ని మార్కులు?
X
ఈ ఏడాది తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌ లో ‘మహర్షి’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు.. దిల్ రాజు.. అశ్వినీదత్.. వంశీ పైడిపల్లి.. దేవిశ్రీ ప్రసాద్.. ఇలా పెద్ద పెద్ద పేర్లు ముడిపడ్డ సినిమా ఇది. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దీని ఆడియోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మామూలుగానే మంచి మ్యూజిక్ ఇస్తాడు. అందులోనూ ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అంటే మ్యూజిక్ ఓ రేంజిలో ఉంటుందని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ దేవి ‘మహర్షి’ ఆడియో విషయంలో అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయాడు. మొన్నటిదాకా నాలుగు పాటలు రిలీజ్ చేస్తే అందులో ‘పదరా పదరా’ మినహాయిస్తే ఏ పాటా అంత ప్రత్యేకంగా లేదు. ముందు వచ్చిన మూడు పాటల విషయంలోనూ విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సినిమాలోని మాస్ నంబర్ ఇకటి దాజాగా రిలీజ్ చేశారు. ‘పాల పిట్ట’ అంటూ సాగే ఈ పాటను ట్విట్టర్లో లాంచ్ చేశాడు మహేష్ బాబు. ఈ పాట ఇన్‌ స్టంట్‌ గా అట్టర్ ఫ్లాప్ అయింది. మాస్ నంబర్ అంటే మాంచి ఊపు ఉంటుందనుకుంటే.. అది చాలా డల్లుగా సాగి అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని లిరిక్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఐతే మాస్ పాటలకు లిరిక్స్‌ తో సంబంధం లేదు. బీట్ ముఖ్యం. మామూలుగా దేవి మిగతా పాటల సంగతెలా ఉన్నా.. తన ప్రతి సినిమాలోనూ మాస్ పాట విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులేయించేలా పాట కంపోజ్ చేస్తుంటాడు. పాల పిట్ట పాటలో ఆ లక్షణాలేమీ లేవు. ‘పదరా పదరా’ పాటతో ఆడియో కొంచెం పైకి లేచినట్లు అనిపించింది. కానీ లేటెస్ట్ సాంగ్.. గ్రాఫ్‌ ను మళ్లీ కిందికి పడేసింది. ఓవరాల్‌ గా చూస్తే ‘పదరా పదరా’ మినహాయిస్తే ‘మహర్షి’ ఆడియో సాధారణం. ఓవరాల్‌ గా దీనికి పాస్ మార్కులు మాత్రమే పడతాయి. ఫస్ట్ క్లాస్‌కు చాలా దూరంలోో ఆగిపోయిందీ ఆడియో.