Begin typing your search above and press return to search.
మహర్షి సౌండ్ స్టార్ట్ అయ్యింది
By: Tupaki Desk | 7 Feb 2019 10:32 AM GMTభరత్ అనే నేను తర్వాత ఏడాది గ్యాప్ తో వస్తున్న సినిమాగా మహర్షి మీద ప్రిన్స్ అభిమానుల అంచనాలు మాములుగా లేవు. దాన్ని మించిన బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముందు ప్రకటించిన ఏప్రిల్ 5 కాకుండా రిలీజ్ డేట్ ని 25 పోస్ట్ పోన్ చేసాక కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ క్వాలిటీ కోసం తప్పదు కాబట్టి సర్దిచెప్పుకున్నారు. ఇకపోతే మహర్షి ఇవాల్టి నుంచి మౌనం వీడాడు. అదేనండి డబ్బింగ్ వర్క్ మొదలుపెట్టేసారు.
నిర్మాత దిల్ రాజు దర్శకుడు వంశీ పైడిపల్లి అల్లరి నరేష్ తో పాటు టీం సభ్యులు పాల్గొనగా పూజా కార్యక్రమాలతో ఇవి స్టార్ట్ చేసారు. సాధారణంగా ఏ సినిమాకైనా డబ్బింగ్ కార్యక్రమాన్ని మీడియా ఈవెంట్ గా చూపించుకోరు. అయితే దిల్ రాజు ఇక్కడ కూడా తన మార్కెటింగ్ తెలివిని చూపించేసారు. మహేష్ ఇందులో లేకపోయినా అభిమానులు దీన్ని విస్తృతంగా షేర్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యింది.
అయితే ముగ్గురిలో మిగిలిన ఇద్దరు నిర్మాతలు అశ్విని దత్ కాని పివిపి ప్రసాద్ కాని కనిపించలేదు. చిన్న కార్యక్రమం కాబట్టి రాలేదా ఇంకా ఎవరైనా కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది. ఈ రోజు అల్లరి నరేష్ తో పాటు ఇతర పాత్రధారుల డబ్బింగ్ తో ఇది కొనసాగనున్నట్టు తెలిసింది. మహేష్ క్లాస్ మెట్ గా ఉండి ఆ తర్వాత స్వంత ఊరిలో వ్యవసాయం చేస్తూ చితికిపోయిన యువ రైతుగా అల్లరి నరేష్ పాత్ర పూర్తి విభిన్నంగా ఉంటుందని తెలిసింది. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్. మహేష్ కి మంచి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవి దీనికి సైతం వాటికి ఏ మాత్రం తీసిపోని రీతిలో కంపోజ్ చేసినట్టు టాక్. ఏదైతేనేం మహర్షి డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక విడుదల గురించి అనుమానాలు అక్కర్లేదు