Begin typing your search above and press return to search.

100 కోట్ల ఆనందం ఎంతదాకా ?

By:  Tupaki Desk   |   14 May 2019 6:30 AM GMT
100 కోట్ల ఆనందం ఎంతదాకా ?
X
ఊహించినట్టే మహర్షి రికార్డుల పర్వానికి తెరతీశాడు. వేసవిని టార్గెట్ చేసుకుని మంచి సీజన్ లో బరిలో దిగిన మహేష్ కు పోటీ లేకపోవడంతో పాటు రైతులకు సంబంధించిన ఎమోషన్ ని బాగా చూపించడంతో పబ్లిక్ ఫుల్ గా కనెక్ట్ అయిపోతున్నారు. అఫీషియల్ గా 100 కోట్లు దాటేసినట్టు ప్రకటన వచ్చేసింది. ఇది గ్రాస్ మాత్రమే. ఇంతే మొత్తంలో షేర్ కనక వస్తే ఇండస్ట్రీ హిట్ మరొకటి ప్రిన్స్ ఖాతాలో పడిపోతుంది.

మహేష్ ఏ సినిమాకు చేయనంత అగ్రెసివ్ ప్రమోషన్ దీనికే చేస్తున్నాడు. ప్రతి చర్యలోనూ ఎగ్జైట్ మెంట్ కనిపిస్తోంది. దీన్ని మించిన సక్సెస్ ని గతంలో ఎన్నో చూసిన మహేష్ ఇలా చేయడం ఆశ్చర్యంగానే ఉంది. భరత్ అనే నేను సైతం ఇంచుమించు ఇలాంటి సక్సెస్ అందుకున్నా మధ్యలో స్లో అయిపోయి రంగస్థలంను క్రాస్ చేయలేకపోయింది.

ఇప్పుడు మహర్షి ముందున్న టార్గెట్ 100 కోట్ల షేర్ ని రీచ్ కావడం. మిక్స్డ్ టాక్ ఇంకా కొనసాగుతోంది. యునానిమస్ గా చూసే తీరాలన్న రీతిలో రిపోర్ట్స్ లేవు. ఏ మాత్రం అపోజిషన్ లేకపోవడం బాగా కలిసి వస్తోంది. దానికి తోడు దిల్ రాజు టీమ్ చేస్తున్న పబ్లిసిటీ క్రమం తప్పకుండ హైప్ తగ్గకుండా చూసుకుంటోంది.

నిజంగానే మహేష్ కోరుకున్నట్టు మహర్షి 100 కోట్ల షేర్ దాటేసి నాన్ బాహుబలిలో రంగస్థలంనో క్రాస్ చేస్తే మంచిదే. అదీ కోరుకుందాం కూడా. ఎఫ్2 తర్వాత మూడు నెలల నుంచి సరైన బ్లాక్ బస్టర్ లేక వెలితిగా ఉన్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఊపిరి అందినట్టు అవుతుంది. వచ్చే ఇతర సినిమాలకు సైతం ట్రేడ్ పరంగా ఇదో బూస్ట్ లాగా పనిచేస్తుంది. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. చూద్దాం మహర్షి టార్గెట్ ఎంతవరకు రీచ్ అవుతాడో