Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు పార్ట్ -2లా మహర్షి
By: Tupaki Desk | 7 April 2019 1:30 AM GMTఎట్టకేలకు మహర్షి టీజర్ రిలీజ్ అయ్యింది. భరత్ అనే నేను సినిమా తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని మహర్షి సినిమాతో వస్తున్నాడు మహేశ్. సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో.. మహర్షిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే టీజర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని ఫ్యాన్స్ ఫీలింగ్. దీనికి కారణం.. మహర్షి టీజర్ శ్రీమంతుడు సినిమాకు కంటిన్యూషన్‌లా ఉండడమే.
అల్ట్రా స్టైలిష్ గా ఉన్న మహేశ్ బాబు.. హెలికాప్టర్ లోంచి దిగుతాడు. అలా నడుచుకుంటూ వస్తాడు. ఓహో.. సినిమా మొత్తం విదేశాల్లో కాబోలు అనుకునేలోపే.. మాసిపోయిన షర్ట్ వేసుకుని సక్సెస్ స్టోరీ గురించి ఒక డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత.. ఏదో ఒలింపిక్స్ లో ఉసేన్ బోల్ట్ కు పోటీ ఇచ్చేవాడిలా కారిడార్ లో అటు ఇటూ పరిగెడతాడు. కట్ చేస్తే.. శ్రీమంతుడు సినిమాలో కన్పించే మామిడితోపు - అలాంటి పైట్లు - చివరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సేమ్ టు సేమ్ శ్రీమంతుడు సినిమాలానే కన్పించింది. దీంతో.. చాలామంది అభిమానులకు తాము చూస్తుంది మహర్షి టీజరా లేదా శ్రీమంతుడు పార్ట్ 2 అని అర్థంకాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
శ్రీమంతుడు సినిమాకు కూడా దేవిశ్రీయే సంగీతం అందించాడు. ఇప్పుడు మహర్షి కూడా దేవీయే మ్యూజిక్ ఇచ్చాడు. దీంతో.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సేమ్ టు సేమ్ లా అన్పించింది. దీనికితోడు లొకేషన్స్ కూడా మ్యాచ్ అయ్యేసరికి చూస్తున్నవారికి శ్రీమంతుడు సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. కనీసం ట్రైలర్ లో అయినా మిగిలిన ఆర్టిస్టుల్ని చూపిస్తే.. మహర్షి సినిమాపై కాస్త బజ్ వచ్చే అవకాశం ఉంటుంది.