Begin typing your search above and press return to search.
మహర్షి: పొలంలో పదరా పదరా అంటున్నాడే!
By: Tupaki Desk | 22 April 2019 5:41 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' మే 9 రిలీజ్ కానుందన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'ఛోటీ ఛోటీ బాతే'.. 'నువ్వే సమస్తం' అంటూ సాగే లిరికల్ సాంగ్స్.. 'ఎవరెస్ట్ అంచున' అంటూ సాగే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమానుండి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఈ పాట పదరా పదరా అంటూ సాగుతుంది. "పదరా పదరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా" అంటూ స్ఫూర్తి రగిలించే విధంగా ఉండే పదాలతో శ్రీమణి సాహిత్యం అందించాడు. ఈ పాటను బుధవారం నాడు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు 'మహర్షి' మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు ఒక పొలంలో పలుగు.. పార.. నాగలి చేత నాగలి చేతబట్టిన రైతులకు ముందు నిలబడి కదం తొక్కుతున్నాడు. పైర్ల పచ్చదానికి సింబల్ అన్నట్టుగా ఆకుపచ్చ రంగు చొక్కా వేసుకొని.. ప్యాంటు ను పైకి మడిచి.. తలకు టవలును తలపాగా లాగా కట్టిమరీ మోడరన్ రైతులా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో మహేష్ బాబు రైతు సమస్యలపై పోరాడతాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ పాట సాహిత్యం.. పోస్టర్ వాలకం చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. బుధవారం సాయంత్రానికల్లా పదరా పదరా పాట ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ఇప్పటివరకూ రిలీజ్ ఐన పాటలు అంచనాలను అందుకోవడంలో తడబడ్డాయి. మరి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటతో అందరినీ మెప్పిస్తాడని ఆశిద్దాం.