Begin typing your search above and press return to search.

మ‌హ‌ర్షి ఈవెంట్‌: పార్ట‌న‌ర్స్ లో క‌ల‌త‌ల్లేన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   1 May 2019 4:02 PM GMT
మ‌హ‌ర్షి ఈవెంట్‌: పార్ట‌న‌ర్స్ లో క‌ల‌త‌ల్లేన‌ట్టేనా?
X
సూపర్ స్టార్ మ‌హేష్ హీరోగా న‌టించిన 25వ సినిమా `మ‌హ‌ర్షి`. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌- మీనాక్షి దీక్షిత్‌- సోనాల్‌ చౌహాన్‌-జగపతిబాబు- రాజేంద్ర ప్రసాద్‌ - ప్రకాశ్‌ రాజ్‌- పోసాని- రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌ రాజు- అశ్వినీ దత్‌- ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. నేటి (బుధ‌వారం) సాయంత్రం హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో మ‌హ‌ర్షి ప్రీరిలీజ్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా సాగుతోంది. ఈ వేడుక‌కు ఇండ‌స్ట్రీ టాప్ గెస్ట్స్ అటెండ‌య్యారు. ఈవెంట్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ట్రైల‌ర్ ని ఆవిష్క‌రించారు. ఇక ఇదే వేదిక‌పై చిత్ర‌యూనిట్ స‌హా కొర‌టాల శివ - విజ‌య్ దేవ‌ర‌కొండ- రాజు సుంద‌రం త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆస‌క్తిక‌రంగా .. ఈ వేదిక‌పై ముగ్గురు నిర్మాత‌లు `పీవీపీ- దిల్ రాజు- అశ్వ‌నిదత్` ఒకే వ‌రుస‌లో ప‌క్క‌ప‌క్క‌నే కూచుని ఎడ‌మొహం పెడ‌మొహంగా క‌నిపించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌హ‌ర్షికి సంబంధించి గ‌త కొన్ని రోజులుగా వ‌స్తున్న వార్త‌ల గురించి తెలిసిందే. అశ్వ‌నిద‌త్ తో బిజినెస్ వ్య‌వ‌హారాల్లో దిల్ రాజు- పీవీపీ విభేధించార‌ని .. చిన్న పాటి మ‌నస్ఫ‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని వార్త‌లొచ్చాయి. అయితే సినిమా కీల‌క‌మైన ఈవెంట్ కి మాత్రం ఎవ‌రూ డుమ్మా కొట్ట‌కుండా ఎటెండ‌య్యారు. పైగా వేదిక దిగువ‌న ఒకే వ‌రుస‌లో ఆశీనులై క‌న్నుల పండుగ తెచ్చారు. మీడియా కెమెరాలు ఆ ముగ్గురు బిగ్ షాట్స్ పైనే ఎక్కువ కాన్ స‌న్ ట్రేట్ చేయ‌డం ఆస‌క్తి రేకెత్తించింది. ఇక వీరితో పాటే మ‌రో నిర్మాత .. మ‌హేష్ 26 చిత్రాన్ని నిర్మిస్తున్న అనీల్ సుంక‌ర ఆ వ‌రుస‌లోనే కూచుని క‌నిపించారు.

ముందే చెప్పిన‌ట్టే మ‌హ‌ర్షి ఈవెంట్ ని టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిర్వ‌హిస్తున్నార‌ని వేదికను చూస్తే అర్థ‌మైంది. భారీ వేదిక‌ ముందు ఊక‌వేస్తే రాల‌నంత మంది జ‌నాలు క‌నిపించారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా మ‌హేష్ అభిమానులు ఈ ఈవెంట్ కి త‌ర‌లిరావ‌డం ఆస‌క్తిక‌రం. ఇక వేదిక‌పై ట్రైల‌ర్ రిలీజైంది. ఈ సినిమాలో రెండు డ్యూయెట్లు నాలుగు మాంటేజెస్ సాంగ్స్ ఉన్నాయని నిర్మాత దిల్ రాజు తెలిపారు. శ్రీ‌మ‌ణి సింగిల్ కార్డ్ పాట‌ల్ని అందించారు.