Begin typing your search above and press return to search.
బుల్లితెరపై రానున్న మహర్షి
By: Tupaki Desk | 26 Jun 2019 6:47 AM GMTఇంకో రెండు రోజుల్లో అర్ధ శతదినోత్సవం జరుపుకోబోతున్న మహర్షి బుల్లితెరపై వచ్చే టైం సిద్ధమవుతోంది. అంటే శాటిలైట్ ద్వారా కాదు కానీ స్మార్ట్ ఫోన్ లేదా నెట్ కనెక్షన్ ఉన్న టీవీలోనో చూసుకోవచ్చన్న మాట. అమెజాన్ ప్రైమ్ ద్వారా మహర్షి వచ్చే నెల అంటే జులై 3న అధికారికంగా విడుదల చేయబోతోంది. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చేసింది. థియేటర్లో మిస్ అయిన ఫ్యాన్స్ ఎవరూ ఉండరు కానీ ప్రేక్షకులు ఉంటారు కాబట్టి వాళ్లకు ఇది మంచి ఆఫర్. ఇంట్లో రిపీట్ మోడ్ లో చూడాలి అనుకునే అభిమానులు సైతం దీంతో పండగ చేసుకోవచ్చు.
200 కేంద్రాల్లో 50 డేస్ రన్ పూర్తి చేసుకోబోతున్న మహర్షి ఫైనల్ రన్ కు వచ్చేశాడు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీదకు కూడా వచ్చేస్తోంది కాబట్టి ఇకపై వసూళ్లు ఆశించడం కష్టమే. అందులోనూ ఇండస్ట్రీలో హాఫ్ సెంచరీ చేయడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో మహర్షి ఫీట్ ని చిన్నదిగా చూడలేం. గత ఏడాది భరత్ అనే నేను కూడా ఇదే తరహాలో అమెజాన్ ప్రైమ్ సరిగ్గా 55వ రోజు విడుదల చేసింది. ఇప్పుడు మహర్షికి అదే ఫార్ములా వర్తింపజేసింది. తక్కువ వ్యవధే కాబట్టి వ్యూస్ పరంగా భారీ రెవిన్యూ ఆశిస్తోంది అమెజాన్.
దీనికి రెండు రోజుల గ్యాప్ లో సూర్య ఎన్జికే కూడా రిలీజ్ చేయబోతున్నారు. మూవీ లవర్స్ కి డబుల్ బొనాంజా అన్నమాట. మహర్షిని మిస్ చేసినవాళ్లు తక్కువే కానీ ఎన్జికె టాక్ దెబ్బకు థియేటర్ కు వెళ్లని వాళ్ళు లెక్కలేనంత ఉన్నారు. సో మంచి టైమింగ్ లో కొత్త సినిమాలతో అమెజాన్ మళ్ళి స్పీడ్ పెంచేసింది. మూడు రోజుల క్రితమే సీతను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే