Begin typing your search above and press return to search.
ఇది నరేష్ గర్వపడే విజయమేనా
By: Tupaki Desk | 13 May 2019 2:30 PM GMTమహర్షి ఏ రేంజ్ సక్సెస్ మహేష్ అన్నట్టు ఇది కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించబోయే మూవీగా నిలుస్తుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం రావడానికి ఇంకో పది రోజులైనా ఆగాలి. అప్పుడు కాని సరైన ఫిగర్స్ తో ఓ కంక్లూజన్ కు రాలేం. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో యూనిట్ లో ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిపోయి సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పేసుకున్నారు కాని మొదటి నాలుగు రోజుల వసూళ్ళను బట్టి స్టార్ హీరో మూవీ ఫేట్ ని డిసైడ్ చేయడం తొందరపాటుతనమే అవుతుంది.
ఇదిలా ఉండగా అల్లరి నరేష్ నాలుగేళ్ల తర్వాత హిట్ అనే మాట వింటున్నానని దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేశాడు. సక్సెస్ కోసం నరేష్ ఎంతగా తపించిపోతున్నాడో దాన్నిబట్టే అర్థమైపోయింది. కాని మహర్షిలో నరేష్ చేసిన రవి పాత్ర అతనికి బంగారు భవిష్యత్తు ఇస్తుందని ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎందుకంటే మహర్షి పూర్తిగా మహేష్ వన్ మ్యాన్ షో. కథలో ఎంత కీలకమైన పాత్ర చేసినా అందులో అల్లరి నరేష్ చాలా పరిమితుల మధ్య నటించాడు. కామెడీకి కాని తనవరకు ఉన్న ఇమేజ్ పరంగా ఏదైనా హీరోయిజం కాని చూపించే ఛాన్స్ దక్కలేదు. కేవలం సానుభూతి మీదే అది చివరి దాకా నడుస్తుంది.
బయటకి వచ్చాక ఓ పది శాతం మన మదిలో నరేష్ మెదిలినా మిగిలిన తొంభై శాతం స్పేస్ తీసుకుంది మహేశే. సో అల్లరి నరేష్ కు సోలో హీరోగా సాలిడ్ హిట్ పడే దాకా ఇంకా వేచి చూడాల్సిందే. అది బంగారు బుల్లోడుతో తీరుతుందనే నమ్మకంతో ఉన్నాడు అల్లరోడు. అది గట్టిగా హిట్టు కొడితే ఓకే. లేదంటే కథ మళ్ళి మొదటికే వస్తుంది. ప్రతిసారి రవి లాంటి క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ ఉండలేడు కదా. హీరోగా యాభై సినిమాలు చేసిన నరేష్ కు ఇలాంటి ఛాలెంజ్ ఎదురుకోవాల్సి రావడం వింతే