Begin typing your search above and press return to search.
ఖైదీని టార్గెట్ చేసిన మహర్షి
By: Tupaki Desk | 11 Jun 2019 5:28 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబుకు సమ్మర్ సీజన్ సూపర్ గా కలిసి వచ్చింది . తన పాతికేళ్ళ కెరీర్ లో ఇదే బెస్ట్ మూవీగా పదే పదే చెప్పుకున్న ప్రిన్స్ మాటలకు తగ్గట్టుగా రికార్డులు తన ఖాతాలో వేసుకుంటూనే ఉంది. వీక్ అపోజిషన్ తో పాటు తర్వాత వచ్చిన సినిమాలేవీ కనీస స్థాయిలో ఆడకపోవడంతో మహర్షికి చాలా బెనిఫిట్ దొరికింది. అందిన సమాచారం మేరకు మహర్షి ఐదో వారంలో అడుగుపెట్టగానే వంద కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగు పెట్టాడు.
దిల్ రాజుతో పాటు అభిమానులు దీన్ని గతంలోనే చెప్పారు కాని ఇప్పటికది సాధ్యమయ్యిందని తెలిసింది. ప్రస్తుతం 101 కోట్ల మార్క్ దగ్గర ఉన్న మహర్షి ఇంకోక్క కోటి రాబడితే చిరంజీవి ఖైది నెంబర్ 150 రికార్డును సొంతం చేసుకోవచ్చు. నైజాంలో 30 కోట్ల షేర్ దాటేసి బాహుబలి రెండు భాగాల తర్వాత మూడో స్థానాన్ని మహర్షి ఆక్రమించుకున్నాడు
ఇక ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా షేర్లలో మూడో స్థానంలో ఉన్న రంగస్థలం 120 కోట్లను అందుకోవడం మాత్రం మహర్షికి అసాధ్యమనే చెప్పాలి. మొదటి వారంలో టికెట్ల పెంపు అదనపు షోలు లేకపోతే మహర్షికి ఈ ఫీట్ సాధ్యమయ్యేది కాదన్న కామెంట్ ని పక్కన పెడితే వాస్తవంగా కూడా ఖైది నెంబర్ 150-రంగస్థలంలకు విడుదల సమయంలో ఇలాంటి అదనపు వెసులుబాటులు లేవు. పైగా జిఎస్టి బాదుడు అప్పుడు ఎక్కువగా ఉంది.
ఏదైతేనేం బాక్స్ ఆఫీస్ లెక్కలకు ఫైనల్ గా కావల్సింది ఫిగర్స్ కాబట్టి ఆ రకంగా చూసుకుంటే మహర్షి టాప్ 5లో చేరిపోయి మహేష్ కు 25వ సినిమా ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే అవకశాన్ని ఇచ్చింది. యాభై రోజుల దాకా రన్ కొనసాగుతుందో లేదో చెప్పలేం కాని ఇంకో వారంలో ఆ బాలన్స్ ఉన్న కోటి షేర్ రావడం మాత్రం ఖాయమే