Begin typing your search above and press return to search.
ఆ నష్టాల్ని మహేష్ భర్తీ చేస్తారా?
By: Tupaki Desk | 27 May 2019 7:14 AMసూపర్ స్టార్ మహేష్ నటించిన `మహర్షి` మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. దిగ్విజయంగా నిన్నటికి రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 రోజుల్లో ఈ సినిమా ఎంత షేర్ వసూలు చేసింది? ఏఏ ఏరియాలు గట్టెక్కాయి? ఏఏ ఏరియాల్లో నష్టాలొచ్చాయి? ఓవర్సీస్ రిపోర్ట్ ఏంటి? అన్న లెక్కలు తీస్తే.. పలు ఆసక్తికర సంగుతులే తెలిశాయి.
మహర్షి రెండు వారాల్లో షేర్స్ పరిశీలిస్తే.. నైజాం - వైజాగ్ ఏరియాల్లో ప్రాఫిట్స్ లో వున్నారని తెలుస్తోంది. మిగతా ఏరియాస్ లో ఇంకా రావలసిన అమౌంట్స్ పరిశీలిస్తే.. ప్లస్ లేదా మైనస్ లలో చూస్తే....నైజాం 22 కోట్లకు పంపిణీదారులు కొనుక్కుంటే.. 26.67 కోట్లు ఇప్పటికి వసూలైంది. అంటే 4.67కోట్ల మేర లాభాలొచ్చాయి. వైజాగ్ ఏరియాలో తొలి రెండ్రోజుల్లోనే 3.98 కోట్ల షేర్ వసూళ్లతో దుమ్ము దులిపేసింది. వైజాగ్ ఏరియా కలెక్షన్స్ ఇప్పటికే ప్లస్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఓవర్సీస్ వరకూ పరిశీలిస్తే 12.5 కోట్ల బిజినెస్ చేస్తే 2కోట్ల వరకూ పంచ్ పడనుందని ఓ రిపోర్ట్ అందింది. మిగతా మొత్తం రికవర్ అయ్యిందట. ఇక ఓవర్సీస్ లో నాన్ బాహుబలి రికార్డ్ లేనట్టేనన్న మాటా వినిపిస్తోంది.
సీడెడ్ ఏరియా వసూళ్లు పరిశీలిస్తే..... 12 కోట్ల మేర హక్కుల్ని కొనుక్కుంటే 9.08 కోట్ల షేర్ వసూలైంది. అంటే 2.92 కోట్లు ఇంకా వసూలు చేస్తేనే సేఫ్ అయినట్టు. కానీ ఇప్పటికే థియేటర్లలో డ్రాప్స్ కనిపిస్తున్నాయి. తూ.గో జిల్లా 6.80 కోట్లకు హక్కుల్ని కొనుక్కుంటే 6.54 కోట్లు వసూలైంది. అంటే ఇక్కడ మరో 26లక్షలు రాబట్టాల్సి ఉంది. ప.గో జిల్లాకి 5.70కోట్లకు కొనుక్కుంటే 5.17కోట్లు వసూలైంది. ఇంకా 53 లక్షలు వసూలవ్వాల్సి ఉంది. కృష్ణ జిల్లా 5.80కోట్ల బిజినెస్ చేస్తే 5.13 కోట్ల మేర వసూలైంది. 67లక్షలు కలెక్టవ్వాల్సి ఉందింకా. గుంటూరు జిల్లాకి 7.70 కోట్ల మేర బిజినెస్ చేస్తే 7.24కోట్లు వసూలైంది. 46లక్షలు రావాల్సి ఉంది. నెల్లూరు ఏరియాకి 3కోట్ల మేర హక్కులు కొనుక్కుంటే 2.56కోట్లు వసూలైంది. 44లక్షలు ఇంకా రావాల్సి ఉంది. ఇతర చోట్ల 9.10 కోట్ల బిజినెస్ చేస్తే 9.87 కోట్లు వసూలైంది. అంటే 77లక్షల లాభాలొచ్చినట్టే.
దిల్ రాజు రిలీజ్ చేసిన ఏరియాల నుంచి 5.84కోట్ల మేర లాభాలొచ్చేశాయి ఇప్పటికే. ఇతర ఏరియాల్లో 5.36కోట్ల మేర నష్టాలు తప్పలేదు. ఆ మేరకు ఇతరచోట్ల పంపిణీదారులకు రికవరీ కష్టమేనట. సీడెడ్ ఏరియా మాత్రం రికవరీ అవ్వదు. `మహర్షి` హిట్ సినిమానే. కానీ ఎక్కువ రేట్లకు హక్కులు కొనడం వల్లన నష్టం వచ్చింది. హీరో మహేష్ మంచి వాడు కాబట్టి ఈ నష్టాల్ని వెనక్కు ఇవ్వటానికి ముందుకు వస్తారేమో చూడాలి అంటూ ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. నిర్మాతల హీరోగా.. పంపిణీ వర్గాల శ్రేయస్సు కోరే హీరోగా మహేష్ కి మంచి పేరున్న సంగతి తెలిసిందే.