Begin typing your search above and press return to search.
మహర్షి ప్రీరిలీజ్ బిజినెస్ ఇదీ
By: Tupaki Desk | 7 May 2019 4:22 AM GMTసూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన `మహర్షి` ఈ శుక్రవారం (మే9) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఏపీ - తెలంగాణ సహా ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజవుతోందని సమాచారం. ఓవర్సీస్ లో 2500 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి థియేటర్ల సర్ధుబాటు గురించి నిర్మాత దిల్ రాజు ఎగ్జిబిటర్లతోనూ సీరియస్ గానే మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది.
అదంతా సరే.. ఈ సినిమాకి బడ్జెట్ ఎంత? ప్రీరిలీజ్ బిజినెస్ ఏ మేరకు సాగింది? ఎంత షేర్ దక్కితే హిట్టయినట్టు? అసలు నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ దక్కాయా? అంటే పలు ఆసక్తికర సంగతులే తెలిసాయి. మహర్షి చిత్రానికి 135 కోట్ల మేర బడ్జెట్ ఖర్చయ్యిందని తెలిసింది. ఏపీ- నైజాం- ఓవర్సీస్ సహా అన్ని చోట్లా కలుపుకుని రూ.96 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే దాదాపు 100 కోట్ల షేర్ వసూలైతే బయ్యరు పాయింట్ ఆఫ్ వ్యూలో విజయం సాధించినట్టే. అంతకుమించి వసూలైతే లాభాల్లోకి వెళుతున్నట్టు. ఇక ఈ సినిమాకి శాటిలైట్.. డిజిటల్ సహా రకరకాల మార్గాల్లో మరో 50కోట్ల వరకూ బిజినెస్ సాగిందన్న అంచనా వెలువడింది.
బిజినెస్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం -22కోట్లు - సీడెడ్-12.60కోట్లు.. వైజాగ్ -8.20కోట్లు .. తూ.గో జిల్లా-7.20కోట్లు.. ప.గో జిల్లా-6కోట్లు.. కృష్ణ-6కోట్లు.. గుంటూరు -7.60కోట్లు.. నెల్లూరు-3.10కోట్లు.. ఓవరాల్ గా ఏపీ- తెలంగాణ కలుపుకుని 72.60 కోట్ల బిజినెస్ సాగింది. కర్నాటక -8.20కోట్లు.. ఇతర భారతదేశంలో 2కోట్ల బిజినెస్ చేస్తే ఓవర్సీస్ లో 12.50 కోట్లు దక్కిందట. మొత్తంగా 95.40కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ బిజినెస్ పూర్తి చేసింది. ఇక ఈ సినిమాకి హిందీ డబ్బింగ్ రూపంలో సుమారు 20కోట్లు.. తెలుగు శాటిలైట్ 16.50కోట్లు.. డిజిటల్ రైట్స్ రూపంలో 11 కోట్లు.. ఇతర రైట్స్ రూపంలో 2.50 కోట్లు దక్కిందట. అయితే రకరకాల కోణాల్లో విశ్లేషిస్తే.. రిలీజ్ టైమ్ కి టేబుల్ ప్రాఫిట్ లేదన్న ముచ్చట పలువురు నిర్మాతల మధ్య సాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సెన్సార్ బృందం యుఏ సర్టిఫికెట్ ఇచ్చి.. ప్రశంసించింది. సినిమాలో హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్న ప్రశంసలు దక్కాయి. పోటీ సినిమాలు ఎలానూ లేవు .. సమ్మర్ సెలవుదినాలు కాబట్టి... ఈ ఊపులో ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? థియేటర్లలో ఏ మేరకు కలెక్షన్స్ సాధిస్తుంది? అన్నది వేచి చూడాల్సిందే.