Begin typing your search above and press return to search.

అందరికీ గేట్లు తెరిచినట్టేగా

By:  Tupaki Desk   |   8 May 2019 10:34 AM GMT
అందరికీ గేట్లు తెరిచినట్టేగా
X
ఇవాళ ప్రెస్ మీట్ లో మహర్షి టికెట్ రేట్ల పెంపు గురించి దిల్ రాజు తమకేమి సంబంధం లేదని ధియేటర్ ఓనర్లే ప్రత్యేక అనుమతి తెచ్చుకుని పెంచుకున్నారని చెప్పిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడీ చర్య భవిష్యత్ పరిణామాలను సూచిస్తోందని చెప్పాలి. ఎంత డిలే అయినా ఏడాదికి పైగానే తీసినా మహర్షి కమర్షియల్ సినిమానే. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ కాని మతిపోయే మేకింగ్ కాని ఇందులో ఉండే ఛాన్స్ లేదు. మహేష్ మార్కు హీరోయిజంతో సందేశం ఇస్తూనే మాస్ అంశాలను మిక్స్ చేసి వంశీ పైడిపల్లి ఇది తీశాడు. సరే దీనికే 138 రూపాయల టికెట్ ని మల్టీ ప్లెక్సుల్లో 200 చేసినప్పుడు వచ్చే ఆరు నెలల కాలంలో రాబోయే టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ సైరా-సాహోలకు ఎంత పెంచాలో అనే కామెంట్స్ అప్పుడే వినిపిస్తున్నాయి. కారణం అవి మహర్షికి మూడింతలు ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు కావడమే

మంత్రి తలసాని ఇది ప్రభుత్వం తరఫున ఇచ్చిన అనుమతి కాదని వాళ్ళు కోర్టు ద్వారా తెచ్చుకున్నారని చెప్పడంతో ఇకపై కూడా ఈ ధోరణి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐదు షోలు భారీ సినిమాలకు మాములు విషయంగా మారిపోవచ్చు. ఇది మంచి పరిణామమే.

కాని రేట్లను ఇలా సినిమా బడ్జెట్ ప్రకారం పెంచుకుంటూ పోయే పనైతే సాహోకు సైరాకు 300 రూపాయల చొప్పున వసూలు చేసుకోవచ్చు. అప్పుడు సాకుగా మహర్షికే పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు అనే లాజిక్ ని చూపిస్తారు. కాబట్టి మహర్షి విషయంలో జరిగిన అధికారిక ప్రకటనలు రాబోయే భారీ సినిమాలకు గైడ్ లా మారబోతోందనేది నిజం