Begin typing your search above and press return to search.

యుఎస్ లో మహర్షి ఎందుకిలా ?

By:  Tupaki Desk   |   13 May 2019 7:25 AM GMT
యుఎస్ లో మహర్షి ఎందుకిలా ?
X
మహర్షి గురించి వస్తున్న స్పందన గురించి యూనిట్ ఎన్ని చెప్పినా సక్సెస్ మీట్ లో ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా యుఎస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో అద్భుతాలు చేయలేకపోయిందన్న మాట వాస్తవం. కొంత ఆలస్యంగా 1 మిలియన్ మార్క్ శనివారం అందుకున్న మహర్షి ఇప్పటిదాకా 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కనీసం 2.5 మిలియన్ డాలర్లు దాటితేనే దీన్ని అక్కడ బ్లాక్ బస్టర్ కింద జమ కట్టవచ్చు.

ఇప్పుడు వీకెండ్ పూర్తయ్యింది. ఇకపై వసూళ్లు ఎలా వస్తాయి అనేది చాలా కీలకంగా మారనుంది. చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోయినా మహర్షి రికార్డులు కొంత స్లోగానే కొట్టడం పట్ల అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఒకపక్క దిల్ రాజు టీం కనివిని ఎరుగని రీతిలో మహర్షికి బ్రహ్మరధం దక్కుతోందని చెబుతున్నారు

ఇక్కడ గ్రౌండ్ లో చూస్తేనేమో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. నైజాం లాంటి ఏరియాలలో మహేష్ కెరీర్ బెస్ట్ అందుకున్నప్పటికి మిగిలిన ప్రాంతాల నుంచి అదే తరహా రిపోర్ట్స్ రావడం లేదు. మొదటి వారం గడిచేలోపు అంటే ఎల్లుండి బుధవారం పూర్తయ్యే సమయానికి కనీసం 50 కోట్ల షేర్ దాటిస్తే మహర్షి ఆపై సేఫ్ గేమ్ ఆడొచ్చు.

సుమారు 95 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న మహర్షి చేరుకోవాల్సిన టార్గెట్ ఇంకా చాలా ఉంది. మహర్షి సభ్యులు చెబుతున్న మాటలకు బయట టాక్ కు కొంత గ్యాప్ అయితే ఉంది. అది వసూళ్ళలో కనిపిస్తోంది. మరి చాలా కీలకంగా మారిన ఈ ఫస్ట్ వీక్ క్లోజింగ్ ని మహర్షి ఎలా ముగిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది