Begin typing your search above and press return to search.
శర్వా మూవీ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్
By: Tupaki Desk | 27 July 2021 5:53 AM GMTశర్వానంద్ ప్రస్తుతం మహాసముద్రం.. ఆడవాళ్లు మీకు జోహార్లు మరియు ఒకే ఒక జీవితం సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా శర్వా ఖాతాలో మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే శర్వా కొన్ని కథలకు ఓకే చెప్పాడని.. వాటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. శర్వా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఒక టైమ్ ట్రావెల్ కథను ఆయన చేయబోతున్నాడట. తమిళ హీరో సూర్య 24 అనే టైమ్ ట్రావెల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది.
ప్రస్తుతం ప్రభాస్.. నాగ్ అశ్విన్ ల కాంబోలో రూపొందుతున్న సినిమా కూడా టైమ్ ట్రావెల్ అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే శర్వానంద్ మొదలు పెట్టబోతున్న కొత్త సినిమా కూడా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటూ సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన టైమ్ ట్రావెల్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా విభిన్నంగా ఉంటుందని శర్వానంద్ సన్నిహితులు చెబుతున్నరాఉ. ప్రస్తుతం ఐడియాపై చర్చలు జరుపుతున్నారని.. శర్వాకు బాగా నచ్చిన ఈ పాయింట్ ను కథగా మల్చే పనిలో రచయితలు ఉన్నారంటూ వారు చెబుతున్నారు.
శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఎప్పటికప్పుడు తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కనుక ఈ టైమ్ ట్రావెల్ సినిమా లో కూడా ఖచ్చితంగా శర్వానంద్ తన బెస్ట్ ఇచ్చి సక్సెస్ దక్కించుకుంటాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు శర్వా వెయిట్ చేస్తున్నాడు. కరోనా కారణంగా సినిమాలు ఆలస్యం అవుతున్నా ఒకసారి కరోనా పరిస్థుతులు కుదుట పడితే బ్యాక్ టు బ్యాక్ అయిదు ఆరు సినిమాలతో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.