Begin typing your search above and press return to search.
మహాసముద్రం.. మొయిన్ పాయింట్ ఇదేనట
By: Tupaki Desk | 14 Oct 2021 4:15 AM GMTదసరాకు ముందు థియేటర్లలో సందడి చేయనున్న సినిమాల్లో ఒకటి ‘మహాసముద్రం’. సిద్ధార్థ్.. శర్వానంద్ నటించిన ఈ మూవీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ మూవీతో దర్శకుడు తనకు సరికొత్త ఇమేజ్ ను క్రియేట్ చేశాడని సంతోషపడిపోతున్నారు సిద్ధార్థ్. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉన్నా.. తన వరకు మాత్రం ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ సినిమాకు ప్రేక్షులు ఎన్ని మార్కులు వేస్తారన్న ఆసక్తితో తాను ఎదురుచూస్తన్నానని చెప్పారు సిద్ధార్థ్. ఈ మూవీలో అదితీరావ్ హైదరి.. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని సింఫుల్ గా ఒక్క లైన్ లో మొత్తం కథను చెప్పేయటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టారు.
మహాసముద్రం ఒక అద్భుతమైన సినిమా అని.. గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమాగా సిద్ధార్థ్ అభివర్ణించారు. నిజానికి తన సినిమాల గురించి విశేషణాలతో గొప్పలు చెప్పుకోవటం అలవాటు లేని సిద్ధార్థ్.. అందుకు భిన్నంగా మహాసముద్రం గురించి అతని నోటి నుంచి వస్తున్న మాటలు.. సినిమా మీద అంచనాల్ని పెంచేస్తున్నాయని చెప్పాలి.
సినిమా కథ గురించి చెబుతూ.. మన స్నేహితుడు మంచోడైనా. చెడ్డోడైనా వదలొద్దన్నదే మొయిన్ పాయింట్ అని చెప్పేశాడు. సింఫుల్ గా మూడు ముక్కల్లో సినిమా కథ మొత్తాన్ని చెప్పేయటం ద్వారా.. మరింత ఉత్సుకతను తెచ్చేలా అతడి మాటలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.