Begin typing your search above and press return to search.

మహేష్ అల్లు అర్జున్ ఎవరి దారి వారిదే..!  

By:  Tupaki Desk   |   13 Dec 2022 2:30 AM GMT
మహేష్ అల్లు అర్జున్ ఎవరి దారి వారిదే..!  
X
అసలేమి లేకపోతేనే స్టార్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి అలాంటిది ఇద్దరు స్టార్స్ ఒక వేడుకకు వచ్చి ఎడమొహం పెడమొహం లాగా ఉంటే ఇక ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైనట్టే. లేటెస్ట్ గా మహేష్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య అలాంటి గొడవే మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ ఇద్దరి ఫ్యాన్స్ ఏదో ఒక విషయం మీద ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవలకు స్టార్స్ ఎండ్ కార్డ్ వేయాలే తప్ప గొడవలకు ఛాన్స్ ఇవ్వకూడదు.

లేటెస్ట్ గా గుణశేఖర్ కూతురు నీలిమ గుణ రిసెప్షన్ వేడుకలో మహేష్, అల్లు అర్జున్ ఇద్దరు ఎదురెదురు పడినా ఎవరికి వారు తమకేమి పట్టనట్టుగా ఉన్నారు. ముందుగా స్టేజ్ మీద మహేష్ ఉన్నాడు. అది గమనించకుండా అల్లు అర్జున్ వేదిక ఎక్కాడు. ఇక అతను వచ్చేప్పుడు తన టీం అంతా హడావిడి చేసింది. మహేష్ ని చూసి జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంతే ఆ తర్వాత ఎవరి దారి అన్నట్టు మొహం తిప్పేసుకున్నారు.

వచ్చిన వేడుక ఒకటి కాబట్టి అక్కడ అంతా హడావిడిగా ఉండటంతో మహేష్ అల్లు అర్జున్ లు మాట్లాడే స్కోప్ లేకపోవచ్చు. కానీ మహేష్ అల్లు అర్జున్ ల మధ్య సఖ్యత లేదన్నట్టు మీడియా ప్రెజెంట్ చేస్తుంది. మహేష్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ ఫైట్ లో ఒకసారి ఒకరిది పైచేయి అయితే మరొకసారి ఒకరిది అవుతుంది.

వారి సినిమాలు రిలీజైన ప్రతిసారి ఇలాంటి ఫైట్ సాధారణమే కానీ లేటెస్ట్ గా ఈ వేడుక అనంతరం మళ్లీ ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది. సినిమాల పరంగా ఎంత ఫైట్ జరిగినా స్టార్స్ మాత్రం కలిసినప్పుడు చాలా సరదాగా ఉంటారు.

కానీ నీలిమ గుణ రిసెప్షన్ టైం లో మహేష్ అల్లు అర్జున్ ల మధ్య అంత సఖ్యత కనిపించలేదు. వారి మనసులో ఏదైనా పెట్టుకుని అలా ప్రవర్తించారా అన్నది తెలియదు కానీ ఈ ఇద్దరి వ్యవహారంపై వార్తలు వైరల్ గా మారాయి. వారి మధ్య ఏమి లేకపోయినా సరే మీడియా కూడా అత్యుత్సాహం చూపిస్తుంది. ఫ్యాన్స్ గొడవలు.. మీడియా ఎక్కువ చేసి చూపించడం ఇవన్ని కూడా వారి మధ్య లేని గొడవని హైలెట్ చేసేలా ఉన్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.