Begin typing your search above and press return to search.

వీడియో: బ్యూటిఫుల్ మెలోడీతో ఆకట్టుకున్న మహేశ్ - సితార..!

By:  Tupaki Desk   |   17 Sep 2022 3:39 AM GMT
వీడియో: బ్యూటిఫుల్ మెలోడీతో ఆకట్టుకున్న మహేశ్ - సితార..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు జీ తెలుగు ఛానల్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన ముద్దుల తనయ సితార ఘట్టమనేనితో కలిసి సీరియల్స్ మరియు షోలను ప్రమోట్ చేస్తున్నారు మహేశ్. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ప్రోమోలు నెట్టింట సందడి చేయగా.. లేటెస్టుగా మరో సరికొత్త వీడియోతో వచ్చారు.

జీ తెలుగు సీరియల్స్ ప్రమోషన్స్ లో భాగంగా మహేశ్ - లిటిల్ ప్రిన్సెస్ సితార కలిసి ఓ మ్యూజిక్ కాన్సెప్ట్ వీడియో సాంగ్ చేసారు. దీన్ని శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో సూపర్ స్టార్ మరియు అతని కుమార్తెల అద్భుతమైన స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

'వీచే గాలి.. ఆగోసారి.. కనులు నీలో చూసి మురిసి పోమన్నాయి.. చందమామా.. నింగినే వీడీ.. నేలపై చేరి వెన్నెలై విరిసిందీ' అంటూ ఎస్పీ చరణ్ పాడిన ఓ అందమైన మెలోడీతో మహేష్ బాబు మరియు సితార కలిసి జీ తెలుగు సరికొత్త సీరియల్స్ ని పరిచయం చేశారు.

మహేష్‌ - సితార గట్టమనేని నటించిన ఈ వీడియోలో తండ్రీకూతుళ్ల మధ్య కొన్ని మధురమైన క్షణాలను మనం చూడొచ్చు. రియల్ లైఫ్ లో వారి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందనేది ఇందులో చూపించడం అభిమానులకు చాలా మనోహరంగా అనిపిస్తుంది.

ఈ వీడియోలో మహేష్ ఓ సోఫాలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతుండగా.. సితార డ్రాయింగ్ రూమ్ నుంచి తొంగి చూసి వెళ్తూ ఉంటుంది. ఏంటా అని మహేష్ వెళ్లి చూడగా.. అక్కడ తన ఫోటోని కూతురు పెయింట్ చేయడం చూసి మురిసిపోతాడు.

అలానే సితార రెండు డ్రెస్సులు తీసుకొచ్చి ఏది బాగుందని అడగ్గా.. తను ధరించిన దుస్తులు బాగున్నాయని మహేశ్ సైగ చేయడం.. అలానే తన చేతులతో కుమార్తెకి వడ్డించడం వంటి ఆనందమైన క్షణాలను ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సందర్భంగా ఇంట్లో మహేష్ ఫ్యామిలీ ఫోటోలను గమనించవచ్చు.

పర్సంటేజ్ తక్కువ వచ్చిందని ప్రోగ్రెస్ కార్డ్ చూసుకుంటూ సితార బాధ పడుతుండగా.. స్కూల్ లో తనకు యావరేజ్ మార్కులే వచ్చాయని మహేశ్ ప్రోగ్రామ్ కార్ట్ తెచ్చి చూపించి ఆమెను ఓదార్చడం భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ పాటలోని అన్ని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

'అనుబంధమే జీవితం.. అనుబంధాల వైపు మరో అడుగు.. ఆరంభం ఒక్క అడుగుతోనే..' అంటూ మహేష్ జీ తెలుగులో ప్రసారం కానున్న పలు సీరియల్స్ మరియు నటీనటులను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

మహేశ్ బాబు ఇందులో ఎప్పటిగాలే చాలా స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా కనిపించాడు. సితార చాలా క్యూట్ గా ఉంది. తండ్రితో సమానంగా తన ఎక్స్ ప్రెషన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. ఓవరాల్ గా తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని తీలియజేసే ఈ వీడియో సాంగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

తొలిసారిగా మహేష్ - సితార కలిసి ఇలాంటి ఒక వీడియో సాంగ్ లో నటించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో బుల్లితెర పై నటించినందుకు మరికొందరు డిజప్పాయింట్ అవుతున్నారు. అలానే యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.