Begin typing your search above and press return to search.

మహేష్ - త్రివిక్రమ్ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   7 Sep 2021 7:30 AM GMT
మహేష్ - త్రివిక్రమ్ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 11 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. #SSMB28 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్రివిక్రమ్ ఇటీవలే ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసారని టాక్ నడుస్తోంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను కూడా ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మహేష్ నటించనున్న 28వ సినిమా గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ లో పాల్గొన్న మహేష్.. అక్టోబర్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ఈ క్రమంలో నవంబర్ నెలలో త్రివిక్రమ్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, 2022 ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.

'అతడు' 'ఖలేజా' వంటి క్లాసిక్స్ తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇది యాక్షన్ జోనర్ లో డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉండే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని #SSMB28 మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అన్నీ కుదిరితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేసే ఆలోచన ఉన్నట్లు నిర్మాత హింట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. మది సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.

శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే మహేష్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. మరోవైపు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ రాస్తున్న 'భీమ్లా నాయక్' సినిమా మహేష్ కు పోటీగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.