Begin typing your search above and press return to search.
మహేష్ మరో పొలిటికల్ టచ్?
By: Tupaki Desk | 16 July 2022 5:30 AM GMTమహేష్ బాబు ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫ్యామిలీ వెకేషన్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి సూపర్ స్టార్ తన కొడుకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. గౌతమ్ ను ప్రత్యేకంగా కాలేజీలో చేర్పించిన తర్వాత మహేష్ బాబు మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చి త్రివిక్రమ్ సినిమాలో మొదలుపెట్టనున్నాడు. ఇటీవల అఫీషియల్ గా సినిమాను ఆగస్టు నెలలో మొదలుపెట్టనున్నట్లు చిత్రం నిర్మాణ సంస్థ క్లారిటీ అయితే ఇచ్చింది.
ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరొక సరికొత్త అంశం వైరల్ గా మారిపోయింది ఎందుకంటే ఈ సినిమాల్లో కూడా మహేష్ బాబు ఒక రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ ఎలాంటి కథలు రెడీ చేసుకున్న కూడా అందులో ప్రతి పాత్రకు బలమైన ప్రాధాన్యత అయితే ఉంటుంది. హీరో పాత్రను డిజైన్ చేయడంలో ఆయన ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.
ఇక మహేష్ బాబు అయితే ఈ స్క్రిప్టును ఓకే చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు కాబట్టి తప్పకుండా మాటలు మాంత్రికుడు మరింత బలంగా రెడీ చేసి ఉంటారు అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే SSMB28 కథలో మహేష్ బాబు ఫ్యామిలీకి పొలిటికల్ నేపథ్యం ఉంటుందట. ఇక అక్కడి నుంచి మహేష్ బాబు ఐటీ మినిస్టర్ గా అధికారం అందుకుంటాడు అని తెలుస్తోంది.
ఇంతకుముందు సినిమాల్లో మహేష్ కొన్నిసార్లు పొలిటికల్ లుక్ లో కనిపించాడు. భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా సక్సెస్ అందుకున్నాడు. అంతకుముందు దూకుడు సినిమాలో ఫేక్ ఎమ్మెల్యేగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ సన్నిహితులు ప్రకారం మాత్రం అది నిజం కాదు అని మరొక కొత్త టాక్ అయితే వినిపిస్తోంది.
సినిమాలో పొలిటికల్ అంశాలు ఉండవచ్చు కానీ మహేష్ బాబుతో అందుకు సంబంధం ఉండదు అని చెబుతున్నారు. ఏదేమైనా కూడా సినిమా సంబంధించిన అప్డేట్స్ వచ్చేవరకు ఈ విషయంపై నమ్మడానికి వీలు లేదు.
కానీ సినిమాలో మాత్రం తప్పకుండా మహేష్ బాబు చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడు అని ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఈ సినిమాలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి అని తెలుస్తోంది. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.