Begin typing your search above and press return to search.
మగవాళ్లకు సపోర్ట్ గా మహేశ్... పునర్నవి ఫైర్
By: Tupaki Desk | 16 Aug 2019 5:13 AM GMTస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం బిగ్ బాస్ హౌస్ దేశభక్తితో నిండిపోయింది. ఆగష్టు15 సందర్భంగా హౌస్ మేట్స్ సమాజనికి ఉపయోగపడే స్కిట్స్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. మొదట స్త్రీ- పురుష సమానత్వంపై మహేష్- రవి- పునర్నవి- వితికా- అషు స్కిట్ తో అదరగొట్టేశారు. ఈ సందర్భంగా మగవాళ్ళు గొప్పా- ఆడవాళ్ళు గొప్పా అంటూ వీరు వాదించుకున్నారు. రవి లవర్ ఉండగానే వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడటంపై వాగ్వాదం జరిగింది.
అలాగే మగవాళ్లు ఎంతమందితో నైనా మాట్లాడొచ్చు.. ఎవరితోనైనా ఉండొచ్చని రవి- మహేష్ లు తమ వాదనను వినిపించారు. నేను ఆడపిల్లని నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటా అని వితిక ఫైర్ అయింది. ఆడపిల్ల చదువులోనూ తల్లిదండ్రుల పెంపకంలోనూ ఎలా అణచివేయబడుతుందో ఎమోషనల్ గా తెలియజేస్తూ ఆడవాళ్ల గొప్పతనం తెలియజేసింది. ఇక సైలెంట్ గా ఉండే అషూ కూడా స్కిట్ లో అదరగొట్టింది. ‘పెళ్లి అనే ఒకే ఒక్క కారణంతో నా ఇష్టాలన్నింటి వదిలేసి మా ఫ్యామిలీని వదిలేసి మీ ఫ్యామిలీతో ఉంటాం. మేం సర్వం త్యాగం చేస్తున్నాం’ అంటూ అషూ రెడ్డి తన వాయిస్ వినిపించింది.
ఇక పునర్నవి ఆడవాళ్లు ఎందుకు మాట్లాడకూడదు.. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎందులో తక్కువ అంటూ స్పీచ్ ఇచ్చింది. సమాజంలో కనీసం మాట్లాడే హక్కు కూడా ఆడవాళ్లకు లేదా అంటూ నిలదీసింది. ఆ తర్వాత బాబా భాస్కర్- రోహిణి- అలీ- శ్రీముఖి- వరుణ్- జ్యోతి హిమజలు మరో స్కిట్ తో అలరించారు. పుట్టిన దేశాన్ని, కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి విదేశాలకు వెళ్లే వాళ్లకు కౌంటర్ ఇస్తూ మంచి మెసేజ్ ఇచ్చారు. చివర్లో దేశభక్తి పాటలు ప్లే అవ్వగా హౌస్ మేట్స్ వాటికి డ్యాన్స్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.