Begin typing your search above and press return to search.
మహేష్ వచ్చేది అప్పుడే
By: Tupaki Desk | 3 July 2018 8:22 AM GMTప్రిన్స్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో రూపొందుతున్న సినిమా విడుదల తేదీ గురించి గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి కానీ నిర్మాతలు మాత్రం ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ లాక్ చేసినట్టుగా తెలిసింది. అంటే సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉండొచ్చేమో అన్న వార్తకు దీంతో చెక్ పడినట్టే. ఒకవేళ అలా ముందు అనుకున్నప్పటికీ చేతిలో ఉన్న ఆరు నెలల టైంలో ఇంత భారీ బడ్జెట్ మూవీని ఫినిష్ చేసి విడుదలకు సిద్ధం చేయటం అసాధ్యం కాదు కానీ అందులో రాజీ పడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అసలే మహేష్ 25వ సినిమా. సెంటిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా దీన్ని ల్యాండ్ మార్క్ మూవీగా మలిచే ప్రయత్నంలో డెడ్ లైన్ పెట్టుకుని తొందరపడకుండా నెమ్మదిగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారట. సో మహేష్ ఫాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.
ఏప్రిల్ 5కు మరో విశేషం ఉంది. ఉగాది పర్వదినం ముందు రోజు అది. అంటే ఒకరోజు ముందే అభిమానులకు పండగ స్టార్ట్ అయిపోతుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుందట. రైతుల సమస్యను కథకు లింక్ చేసినట్టు వినికిడి. అల్లరి నరేష్ పాత్ర మహేష్ తో సమాంతరంగా ప్రయాణం చేస్తూ చాలా కీలకంగా ఉంటుందని అందుకే ఫ్లాష్ బ్యాక్ కాలేజీ ఎపిసోడ్ నుంచే నరేష్ ఎంట్రీ ఇప్పించారని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్ కు జోడి ఉంటుందా లేదా అనే విషయాన్నీ మాత్రం సస్పెన్స్ లో ఉంచారు.
భరత్ అనే నేను తర్వాత దేవి శ్రీ ప్రసాద్ మరోసారి మహేష్ కు స్వరాలు సమకూరుస్తున్నాడు. మూడు భారీ నిర్మాణ సంస్థల కాంబో కాబట్టి ప్రొడక్షన్ గురించి చెప్పాల్సిన పని ఉండదు . ఇప్పటికి ఏప్రిల్ మీద కర్చీఫ్ వేసిన స్టార్ హీరో సినిమా ఏది లేదు కాబట్టి మహేష్ మూవీ సోలోగా ఉన్నట్టే. కాకపోతే ముందు వెనుకా మాత్రం భారీ పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. సైరా-సాహో-2.0 లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని సమ్మర్ నే టార్గెట్ చేసుకున్నాయి. తేదీలు ఖరారు కావాల్సి ఉంది.