Begin typing your search above and press return to search.
మహేష్25.. వచ్చేది ఎప్పుడంటే..
By: Tupaki Desk | 2 July 2018 12:01 PM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో లాగా సినిమాలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వడం లేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా చక చక షూటింగ్ లను పూర్తి చేస్తున్నాడు. అలాగే ఒక మనిషికి రెస్ట్ ఎంత అవసరమో అంతే విశ్రాంతి తీసుకొని సమయాన్ని వేస్ట్ చేయకుండా సినిమాలను పూర్తి చేస్తున్నాడు. భరత్ అనే నేను సినిమాతో ఈ సారి రికవర్ అయిన మహేష్ తన 25వ సినిమతో బిజీ అయిన సంగతి తెలిసిందే.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై మహేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలని కష్టపడుతున్నాడు. ఇటీవల డెహ్రాడూన్ లో షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇటీవల చిత్ర యూనిట్ ఓ క్లారిటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసలైతే వచ్చే ఏడాది సంక్రాంతి కి సినిమాను సిద్ధం చేయాలని అనుకున్నారు. అయితే షెడ్యూల్లో తేడా రావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతాయని సమ్మర్ కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి నాటికి సినిమా షూటింగ్ మొత్తం ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు టైమ్ పడుతుంది కాబట్టి కొంచెం సమయాన్ని తీసుకొని ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే మహేష్ కు భరత్ అనే నేను ద్వారా హిట్టు దొరికింది. అదే తరహాలో తన 25వ సినిమాను కూడా నెక్స్ట్ ఏప్రిల్ లోనే రిలీజ్ చేసి హిట్టు కొట్టాలని హీరోగారు ప్లాన్ చేశారు. మరి అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.