Begin typing your search above and press return to search.

మహేష్ సినిమా పేరు చెప్పనది అందుకే..

By:  Tupaki Desk   |   10 July 2018 4:09 PM IST
మహేష్ సినిమా పేరు చెప్పనది అందుకే..
X
ఏడాదిలో 10 సినిమాల షూటింగ్ లలో పాల్గొని 3 నెలలకో సినిమాను రిలీజ్ చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణది. కానీ ఆయన నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మహేష్ బాబు మాత్రం సినిమాల విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తుంటాడు. చాలా క్యాలిక్యులేటెడ్ గా సినిమాలు తీస్తుంటాడు. తాజాగా భరత్ అనే నేను సినిమాలో యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా కనిపించి హిట్ కొట్టాడు. ఇన్నేళ్ల కెరీర్ లో కేవలం 24 సినిమాలు మాత్రమే తీసిన మహేష్.. ఇప్పుడు తన సిల్వర్ జూబ్లీ 25వ ఫిలింలో నటిస్తున్నాడు.

మహేష్ బాబు 25వ సినిమాను పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తీస్తున్నాడు.. ఈ సినిమాపై అభిమానుల్లో బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. తరువాత షెడ్యూల్ కోసం ఫారిన్ బయలుదేరి వెళ్తున్నారు. ఈ సినిమా టైటిల్.. కాన్సెప్ట్ లాంటివేమీ బయటపెట్టడం లేదు. కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడం లేదు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను బయటపెట్టాలన్నది నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది.

మహేష్ బాబు బర్త్ డే నాడు అభిమానులను అలరించాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకూ సినిమాకు టైటిల్ పెట్టకుండా సీక్రెట్ గా ఉంచారు. టాలీవుడ్ టాప్ బ్యూటీ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ హీరోగా నవ్వులు పూయించే అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. దిల్ రాజు - అశ్వినీదత్ - పీవీపీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.