Begin typing your search above and press return to search.

గర్ల్స్ మ‌హేష్ ని ట‌చ్ చేస్తే ఎలా ఫీల‌వుతురా తెలుసా?

By:  Tupaki Desk   |   23 Jun 2023 12:26 PM GMT
గర్ల్స్ మ‌హేష్ ని ట‌చ్ చేస్తే ఎలా ఫీల‌వుతురా తెలుసా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క్రేజ్ గురించి చెప్పేదేముంది. కోట్లాది మంది అభిమానుల హీరో. అందులోనూ గర్ల్స్ లో విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న న‌టుడు. ఆయ‌న బ్యూటీకి ప‌డిపోయిన గర్ల్స్ ఎంతో మంది. అన్నం తింటున్నాడా? అందం తింటున్నాడా? అంటూ అమ్మాయిలంతా అసూయ ప‌డుతూనే ఉంటారు. మిల్క్ బోయ్ అని ఆయ‌న్ని ఊర‌క‌నే అంటారా? పాల నురుగుల అందాన్ని మంచిన న‌టుడంటూ మ‌హేష్ ని ముందు పెట్టుకుని పొగిడేసిన భామ‌లెంతో మంది. మ‌హేష్ బ్యూటీకి హీరోయిన్లే ఫిదా అవుతుంటారు.

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ క్యూలో ఉన్న హీరోయిన్లు ఎంతో మంది. ఇలా మ‌హేష్ గురించి అమ్మాయిలంతా ఫీల‌వుతుంటారు. ఇది చూసి మ‌హేష్ ఎన్నోసార్లు సిగ్గు ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో అమ్మాయిల ముఖాల్లోకి నేరుగా చూడ‌లేక ప‌క్క‌కు..కింద‌కు త‌ల దించి ఎన్నోసార్లు త‌న‌లో తాను న‌వ్వేసుకున్నారు. త‌న మ‌న‌సు సైతం ఎన్నోసార్లు ఉప్పొంగింది. మ‌రి అంద‌మైన అమ్మాయిల గురించి మ‌హేష్ లోలోప‌ల ఏమ‌నుకుంటున్నారో? ఎవ‌రికైనా తెలుసా? ఈ విష‌యం ఆయ‌న ఎప్పుడైనా చెప్పారా? అంటే చెప్పార‌నే అనొచ్చు.

ఆయ‌న కెరీర్ లో ఎదురైన ఓ బెస్ట్ మూవ్ మెంట్ ఇలా పంచుకున్నారు. ఓ అమ్మాయి ప్ర‌త్యేకంగా మ‌హేష్ ని తాకొచ్చా? అని అడిగిందిట‌. దానికి మ‌హేష్ య‌స్ త‌ప్ప‌కుండా అంటూ బ‌ధులివ్వ‌డంతో? ఆ అమ్మాయి మ‌హేష్ చేతిని వేలితో ట‌చ్ చేసిందిట‌.

ఈ ట‌చ్చింగ్ కి అమ్మాయి ఎంత సంతోష‌ప‌డిందో తెలియ‌దు గానీ..మ‌హేష్ మాత్రం ఆ అమ్మాయిని మించి ఎక్కువ సంతోష‌ప‌డ్డాను అని అన్నారు. త‌న‌ని ఇంత‌గా ఆరాదించే అభిమానులు ఉండ‌టం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసారు.

తాను అంద‌రిలాగే మ‌నిషినే అయినా! ఇలా ట‌చ్ చేసి చూడ‌టం అన్న‌ది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి అనుభ‌వాన్ని చూడ‌లేద‌న్నారు. ఇవ‌న్నీ ఆ దేవుడు ఇచ్చిన గిప్ట్.

జ‌న్మంతా నాన్న‌కి రుణ‌ప‌డే ఉంటాను అని అన్నారు. నిజ‌మే టాలీవుడ్ లో చాలా మంది హీరోలున్నారు. కానీ ఇలాంటి అనుభ‌వాన్ని ఏ హీరో పొంద‌లేద‌రు. ప్ర‌స్తుతం మ‌హేష్ 'గుంటూరు కారం' అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.