Begin typing your search above and press return to search.

మళ్లీ నాకు 'పోకిరి' రోజులు గుర్తుకొచ్చాయ్

By:  Tupaki Desk   |   8 May 2022 3:03 AM GMT
మళ్లీ నాకు పోకిరి రోజులు గుర్తుకొచ్చాయ్
X
మహేశ్ బాబు హ్యాట్రిక్ హిట్ కొట్టిన తరువాత చేసిన సినిమా 'సర్కారువారి పాట'. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై మహేశ్ బాబు మాట్లాడాడు.

"అందరికీ నమస్కారం .. ఇలాంటి ఒక ఫంక్షన్ లో మనం కలుసుకోక దాదాపు రెండేళ్లు అయినట్టుగా ఉంది. మీ అందరినీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. ముందుగా పరశురామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో నా పాత్రను ఆయన చాలా గొప్పగా డిజైన్ చేశారు. నిజం చెప్పాలంటే నేను ఇంతవరకూ చేస్తూ వచ్చిన చెప్పుకోదగిన పాత్రలలో ఇది ఒకటి. నా డైలాగ్ డెలివరీనీ .. బాడీ లాంగ్వేజ్ నీ టోటల్ గా ఆయన డిజైన్ చేసిందే. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేస్తూ నేను ఈ సినిమాకి పనిచేశాను.

కొన్ని సీన్స్ లో యాక్ట్ చేసేటప్పుడు నాకు 'పోకిరి' రోజుకు గుర్తుకు వచ్చాయి. పరశురామ్ గారు నాకు కథ వినిపించి ఇంటికి వెల్లిపోయిన తరువాత నాకు ఒక మెసేజ్ పెట్టారు. 'థ్యాంక్యూ సార్ మీ 'ఒక్కడు' సినిమా చూసి దర్శకుడిని అవుదామని చెప్పేసి బండెక్కి హైదరాబాద్ వచ్చేశాను. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇక చూడండి ఈ సినిమాను ఇరగదీసేస్తాను సార్' అని. 'సర్కారువారి పాట' వంటి ఒక సినిమాను నాకు ఇచ్చినందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను.

ఈ సినిమాలో చాలా చాలా హైలైట్స్ ఉంటాయి. నాకు తెలిసిన హైలైట్స్ లో ఒకటి హీరో .. హీరోయిన్ ట్రాక్. నాకు తెలిసి ఈ ట్రాక్ కోసం కచ్చితంగా రిపీట్ ఆడియన్స్ ఉంటారు .. అది రాసుకోండి. కీర్తి సురేశ్ క్యారెక్టరైజేషన్ .. యాక్టింగ్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. తను చాలా గొప్పగా చేసింది. ఈ సినిమా షూటింగును బట్టి ఎప్పుడు ఏ డేట్స్ అడిగినా వెంటనే ఇస్తూ కోపరేట్ చేశారు. ఎందుకు వచ్చిందో తెలియదుగానీ తమన్ తో నాకు చాలా గ్యాప్ వచ్చింది .. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. ఈ సినిమాలో ఆయన ఇరగదీసేశాడు" అంటూ చెప్పుకొచ్చారు .