Begin typing your search above and press return to search.
శంకర్ కూతుళ్లని తెలియక అలా అన్నాను: మహేశ్ బాబు
By: Tupaki Desk | 5 Feb 2022 9:42 AM GMTఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ తెలుగు తెరకి పరిచయమైతే, కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు తన సత్తా చాటుకుంటున్నాడు. ఆయితే హీరోలుగా వాళ్ల తరాలు వేరు .. వాళ్లకి గల ఇమేజ్ వేరు. బాలకృష్ణ ఎంత సూటిగా మాట్లాడతారో .. మహేశ్ బాబు అంత సున్నితంగా మాట్లాడతారు. వాళ్లు ఎంచుకునే కథలు .. పాత్రలు కూడా పూర్తి డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ఇద్దరూ కలిసి 'ఆహా'లో అన్ స్టాపబుల్' వేదికపై కనిపించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. నిన్న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ఈ వేదికపై బాలకృష్ణ - మహేశ్ బాబు నవ్వుల సందడి చేశారు.
బాలకృష్ణ అడిగిన కొన్ని ప్రశ్నలకు మహేశ్ బాబు స్పందిస్తూ .. " మా నాన్న దగ్గర నుంచి నేను మంచితనం నేర్చుకున్నాను. ఆయనను చూసి నేర్చుకోకూడనిది కూడా మంచితనమే అనే విషయం అర్థమైంది. మా ఫాదర్ ను మేము ఎప్పుడూ మిస్ కాలేదు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మా కోసం ఆయన సమయాన్ని కేటాయించేవారు. ప్రతి సమ్మర్ లో పిల్లలను వెకేషన్ కి తీసుకుని వెళ్లడం కూడా ఆయన మాకు నేర్పించినదే. నాన్నగారు ఎన్టీఆర్ గారి అభిమానినే. ఆయన 'అల్లూరి సీతారామరాజు' సినిమాను ఎన్టీఆర్ గారికి చూపించినప్పుడు, నేను అయితే ఇలా చేయలేనేమోనని ఆయన అన్నట్టుగా మాతో చెప్పారు.
ఇక ఒకసారి ముంబైలో షూటింగు పూర్తి చేసుకుని ఒక హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా ఇద్దరమ్మాయిలు వచ్చి ఫొటో తీసుకుంటామని అడిగారు. 'సారీ అమ్మా .. ఇది సమయం కాదు' అన్నాను. వాళ్లు అక్కడి నుంచి అలా వెళ్లగానే .. వెయిటర్ వచ్చి, "వాళ్లిద్దరూ ఎవరో కాదు సార్ .. దర్శకుడు శంకర్ కూతుళ్లు" అని చెప్పాడు. వెంటనే నేను వాళ్ల వెనుకనే వెళ్లాను .. అక్కడ శంకర్ కూడా ఉన్నారు. 'వాళ్ల అమ్మాయిలనే విషయం నాకు తెలియదు' అని అన్నాను. ఆయనను చూడటం అదే మొదటిసారి. శంకర్ గారి కూతుళ్లు అంత సింపుల్ గా ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది.
ఇక తాను వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించడం గురించి మహేశ్ బాబు స్పందించారు. "మా అబ్బాయి గౌతమ్ 6 వారాల ముందుగానే పుట్టాడు. అప్పుడు నా అరచేయి అంతే ఉండేవాడు. అలాంటి గౌతమ్ ఇప్పుడు నా హైట్ ఉన్నాడు. మాకు డబ్బులు ఉన్నాయి కనుక ఓకే .. డబ్బులు లేని వారి పరిస్థితి ఏమిటి? అనిపించింది. అందువలన అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి సాయం చేయాలని అప్పుడే అనుకున్నాను" అని చెప్పారు. అప్పుడు బాలకృష్ణ చప్పట్లు కొడుతూ మహేశ్ ను అభినందించారు. మహేశ్ బాబు మానవత్వం గురించి ఈ వేదిక ద్వారా మరింతమందికి తెలిసింది.