Begin typing your search above and press return to search.

మహేష్ కి దాని విలువ తెలిసొచ్చింది

By:  Tupaki Desk   |   6 Aug 2015 5:32 PM IST
మహేష్ కి దాని విలువ తెలిసొచ్చింది
X
సూపర్ స్టార్ మహేష్ బాబుకి వున్న స్టార్ క్రేజ్ అసామాన్యం. ఆ విషయాన్ని ఆయన సినిమా కలెక్షన్లే చెబుతున్నాయి. సినిమాలలో తనదైన మాకు పంచులతో, అద్భుతమైన నటనతో ఇరగదీసే మహేష్ మాత్రం బయట పెద్దగా మాట్లాడదు. ఆడియో రిలీజ్ లు, ఇంటర్వ్యూ లలో సైతం చిన్న చిన్న స్పీచ్ లతో, జవాబులతో మహేష్ పని పూర్తిచేస్తుంటాడు. అయితే అభిమానులతో ముచ్చటించడం, అభిమానులకు తన సమయాన్ని కేటాయించడంలో వున్న విలువని మహేష్ ఈ మధ్యే తెలుసుకుంటున్నాడు.

ఎప్పుడో తన సినిమా కబుర్లకు మాత్రమే వినియోగించే ట్విట్టర్ మాధ్యమాన్ని మహేష్ ఈ మధ్య తరచూ వాడుతుండడం విశేషం. సినిమా కబుర్లే కాక చాట్ సెషన్ లు, తనకు నచ్చిన కొటేషన్ లు, తనని అలరించిన క్రియేటివ్ ఫోటోలు కూడా మహేష్ షేర్ చేస్తుండడంతో మహేష్ బాబుకి ట్విట్టర్ విలువతెలిసోచ్చిందని అభిమానులు సంబరపడిపోతున్నారు.