Begin typing your search above and press return to search.
మహేష్ బాబు 'AMB సినిమాస్' ఐడియా ఎవరిదంటే..!
By: Tupaki Desk | 5 July 2021 11:30 AM GMTఏసియన్ సినిమాస్ నారాయణ దాస్ కె.నారంగ్.. అగ్రగామి సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ ను స్థాపించి తనయుడు సునీల్ నారంగ్ సమర్పణలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబోలో 'లవ్ స్టోరీ' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేశారు. అక్కినేని నాగార్జున - ధనుష్ వంటి స్టార్ హీరోలతో పాటుగా పలువురు యువ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నారాయణ దాస్ నారంగ్.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా AMB సినిమాస్ ఐడియా తనయుడు సునీల్ దే అని.. ఎంత ఖర్చు అయినా గ్రాండ్ గా మల్టీప్లెక్స్ కడదామని చెప్పాడని.. దానికి సరేనన్నానని.. ఇంటీరియర్ మొత్తం భరత్ నారంగ్ చూసుకున్నాడని నారాయణ దాస్ తెలిపారు. AMB మాల్ కోసం మహేష్ బాబుతో చేతులు కలపడం గురించి మాట్లాడుతూ.. ''ఆ ప్రాపర్టీ ల్యాండ్ నాది. దాంట్లో మాల్ నిర్మించాలనేది సునీల్ ఉద్దేశ్యం. మహేష్ బాబు గారి వైఫ్ నమ్రత గారు ఓసారి కలిసినప్పుడు ఈ బిజినెస్ లో 50% వాటా ఇవ్వమని కోరారు. నేను ముందు వద్దు అని చెప్పాను. కానీ తర్వాత సరే అని చెప్పాను. ఆమె 50% కొనుక్కుంది. అప్పటి నుంచి ఇద్దరం భాగస్వాములుగా కొనసాగుతున్నాం'' అని చెప్పారు.
అల్లు అరవింద్ ఇంట్రెస్ట్ చూపించడంతో అల్లు అర్జున్ తో కలసి థియేటర్ నిర్మించామని.. అలానే విజయ్ దేవరకొండ తో కలిసి మరో థియేటర్ కట్టామని నారాయణ దాస్ నారంగ్ అన్నారు. ఈ సందర్భంగా 'యమగోల' సినిమా గురించి చెబుతూ.. 30 లక్షలతో ఎన్టీఆర్ 30 కాల్షీట్స్ తో తీశారని.. రామారావు రెమ్యూనరేషన్ కూడా రూ.లక్ష లోపే ఉండేదని చెప్పుకొచ్చారు.