Begin typing your search above and press return to search.

షాకిస్తున్న AMB మాల్ కాస్ట్‌!

By:  Tupaki Desk   |   3 Dec 2018 4:30 AM GMT
షాకిస్తున్న AMB మాల్ కాస్ట్‌!
X
సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్- థియేట‌ర్ చైన్ బిజినెస్‌ లో ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. దీపం ఉండ‌గానే తెలివైన పెట్టుబ‌డుల‌తో బిజినెస్‌ లో అడుగులు వేస్తూ ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ గా ఎదిగే ప్లాన్ చేశాడు. ఓవైపు కొంద‌రు హీరోలు దేశ‌ - విదేశాల్లో రెస్టారెంట్ బిజినెస్‌ లు ప్లాన్ చేస్తుంటే మ‌హేష్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. స్వ‌దేశంలో - తెలుగు రాష్ట్రాల్లోనే ఖ‌రీదైన ప్రైమ్ ఏరియాల్లో స్థ‌లాలు కొని అక్క‌డ భారీ మ‌ల్టీప్లెక్సుల నిర్మాణానికి - అందులో థియేట‌ర్ల ఏర్పాటుకు ప్లాన్ చేశాడు. అందుకోసం భారీగా పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లుతున్నాడు.

ఈ ప‌య‌నంలో తొలి అడుగు గ‌చ్చిబౌళి ఏఎంబీ మాల్‌ తోనే ప‌డింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖ‌రీదైన సాఫ్ట్ వేర్ హ‌బ్ ఉన్న చోట తెలివైన పెట్టుబ‌డి ఇద‌న్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఏషియ‌న్ సినిమాస్‌ తో క‌లిసి మ‌హేష్ ఈ మ‌ల్టీప్లెక్స్‌ ని ప్రారంభించారు. ఏషియ‌న్ తో భాగ‌స్వామ్యంలోనే న‌గ‌రంలో మ‌రిన్ని మ‌ల్టీప్లెక్సుల నిర్మాణానికి ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ ఏడాది చివ‌రిలో మ‌రో భారీ మ‌ల్టీప్లెక్సును ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది.

గ‌చ్చిబౌళి- కొత్త‌గూడ‌-బ‌యోపార్క్ ప‌రిస‌రాల్లో ఉన్న మ‌ల్టీప్లెక్స్ న‌గ‌రంలోనే త‌ల‌మానికంగా కొలువు దీరింది. ఏడెనిమిది ఎక‌రాల్లో అత్యంత భారీ నిర్మాణమిది. ఐకియాని త‌ల‌ద‌న్నేంత ప్లేస్‌ లో దీనిని నిర్మించారు. 60,000 చ‌ద‌ర‌పు అడుగులు మాల్ ప్లేస్ ఉంటుంద‌ని ఓ అంచ‌నా. అస‌లు ఇది ఇంద్ర‌భ‌వ‌న‌మా? అన్న తీరుగా మైమ‌రిపిస్తోంది. ఇందులో ఏడు స్క్రీన్ల ఏర్పాటు కోసం ఏకంగా 84 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. వాస్త‌వానికి దీనిని మ‌ల్టీప్లెక్స్ అని పిల‌వ‌కూడ‌దు. ఓన్లీ సూప‌ర్‌ ఫ్లెక్స్ అనే పిల‌వాలి. ఎందుకంటే ఇలాంటిది సిటీలో ఇంకోటి లేనేలేదు. రెగ్యుల‌ర్ మ‌ల్టీప్లెక్స కి దీనికి ఉన్న తేడా ల‌గ్జ‌రీ యాంబియెన్స్ - థియేట‌ర్ సిట్టింగ్‌ లో సీట్ల స‌దుపాయం ఎంతో సౌక‌ర్య‌వంత‌మైన‌వి. సూప‌ర్‌ ఫ్లెక్స్ లో 360 డిగ్రీల కోణంలో సినిమా వీక్ష‌ణ స‌దుపాయం ఉంది. రిక్లెయిన‌ర్ సీట్స్‌ తో మ‌సాజ్ ఫెసిలిటీ కూడా ఉందిట‌. అందుకే దీనికి పేమెంట్ చాలా ఎక్కువ‌. టిక్కెట్టు ధ‌ర రూ.200 పైనే ఉంటుంద‌ని తెలుస్తోంది. భారీ పారితోషికాలు అందుకునే ఖ‌రీదైన సాఫ్ట్ వేర్ బాబుల‌కు ఖాళీ స‌మ‌యాల్లో ఇదో రిలాక్స్‌ డ్ పాయింట్‌ లా ప‌నికొస్తుంద‌న్న మాటా వినిపిస్తోంది. ఇదే త‌ర‌హా వెంచ‌ర్‌ ని వేరొక ఖ‌రీదైన ప్రైమ్ ఏరియాలోనూ ఏర్పాటు చేసేందుకు ఏఎంబీ సినిమాస్ స‌న్నాహ‌కాల్లో ఉందిట‌. ఇలా హైద‌రాబాద్‌ తో పాటు - తిరుప‌తి - అమ‌రావ‌తి - విజ‌య‌వాడ‌ - వైజాగ్‌ లోనూ ఏఎంబీ మాల్స్ నిర్మిస్తార‌ని తెలుస్తోంది.