Begin typing your search above and press return to search.

`సూప‌ర్‌ ఫ్లెక్స్` బాదుడు లాజిక్!

By:  Tupaki Desk   |   4 Dec 2018 5:11 AM GMT
`సూప‌ర్‌ ఫ్లెక్స్` బాదుడు లాజిక్!
X
సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్-థియేట‌ర్ చైన్ బిజినెస్‌ లో ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. తొలిగా హైద‌రాబాద్ గ‌చ్చిబౌళి ఏరియా లో న‌గ‌రానికే త‌ల‌మానికం అన‌ద‌గ్గ అతిపెద్ద మాల్‌ ని ప్రారంభించారు. ఇందులో ఏడు స్క్రీన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే వీటిలో టిక్కెట్టు ధ‌ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయి? అన్న‌దానికి ఆస‌క్తికర వివ‌రాలు తెలిసాయి.

రెగ్యుల‌ర్ మల్టీ ప్లెక్సు ల్లో 150 టిక్కెట్టు, ఎగ్జిక్యూటివ్ రిక్లెయిన‌ర్ చైర్‌ కి రూ.250 టిక్కెట్టు మాత్ర‌మే ఉంటే.. ఏఎంబీ సినిమాస్‌ లో క‌నిష్టంగా రూ.200 నుంచి గ‌రిష్టంగా రూ.440 వ‌ర‌కూ టిక్కెట్టు ధ‌ర‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. రూ.200- రూ.230-రూ.300-రూ.440 రేంజు లో నిర్ణ‌యించార‌ట‌. అయితే ఇంత భారీ బాదుడును సామాన్యుడు అయితే త‌ట్టుకోలేరు. పైగా తెలంగాణ‌ లో ఈ ధ‌ర‌ల‌కు జీవో లేదు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం రూ.150 ధ‌ర‌కు మాత్ర‌మే టిక్కెట్టు అమ్మాలి. రిక్ల‌యిన‌ర్ల‌కు 250ఓకే. అదే గ‌రిష్ఠ టిక్కెట్టు ధ‌ర‌. అంత‌కుమించి బాదితే చ‌ట్ట‌విరుద్ధం.

ఇదివ‌ర‌కూ థియేట‌ర్ల‌ యాజ‌మాన్యం ఒత్తిళ్ల‌కు త‌ల‌వొంచి హ‌ద్దుమీరి టిక్కెట్టు ధ‌ర పెంచుతూ తేరాస ప్ర‌భుత్వం జీవో తెస్తే జ‌నాల్లో వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. దీంతో వెంట‌నే ప్ర‌భుత్వం నిర్ణ‌యం మార్చుకుని జీవో వెన‌క్కి తీసుకుంది. ఇప్పుడు ఏఎంబీ సినిమాస్‌ కి టిక్కెట్టు బాదుడుకు అప‌ద్ధ‌ర్మ‌ ప్ర‌భుత్వం అనుమ‌తి ఎలా ఇస్తుంది? ఏఎంబీ సినిమాస్ యాజ‌మాన్యం టిక్కెట్టు అద‌న‌పు బాదుడు జీవో కోసం ప్ర‌య‌త్నిస్తుందా? అన్న చ‌ర్చా సాగుతోంది. ఇది సూప‌ర్‌ ఫ్లెక్స్ అని పిల‌వ‌డం వెన‌క అస‌లు లాజిక్ ఇదీ అన్న మాట కూడా వినిపిస్తోంది. రొటీన్ మ‌ల్టీప్లెక్స్ కాదు ఇది.. టిక్కెట్టు బాదుడు ఫ్లెక్స్..అన్న ప్ర‌చారం సాగుతోంది. అయితే సాఫ్ట్ వేర్ హ‌బ్‌లో దీనిని ఏర్పాటు చేయ‌డం వెన‌క ఉద్ధేశ‌మే వేరని తొలినుంచి యాజ‌మాన్యం చెబుతోంది. వీవీఐపీల‌కు మాత్ర‌మేనా సూప‌ర్‌ ఫ్లెక్స్.. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతోనే నిర్మించారా? అన్న క్లారిటీ జ‌నాల‌కు రావాల్సి ఉందింకా. సూప‌ర్‌ ఫ్లెక్స్ అన్న పేరుకు త‌గ్గ‌ట్టే ఇత‌ర థియేట‌ర్ల‌తో పోలిస్తే ఇందులో సిట్టింగ్ సిస్టమ్ ఎంతో గొప్ప‌గా ఉంది. ఖ‌రీదైన ఒక వ‌ర్గానికే ఇది అనుకూలం అన్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది.