Begin typing your search above and press return to search.

2 పాయింట్ ఓ.. లైన్ క్లియర్ చేసారా?

By:  Tupaki Desk   |   12 Dec 2017 7:30 AM GMT
2 పాయింట్ ఓ.. లైన్ క్లియర్ చేసారా?
X
సౌతిండియా సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఏకంగా సాఫ్ట్ వేర్ ఆఫీసులకు కూడా సెలవలు ప్రకటించే రేంజ్ రజినీది. సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ 2.ఓ పై ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. మినిమం 500 కోట్ల షేర్ రాబడితే మినహా హిట్ అనిపించుకోని పరిస్థితి. ఇదేమీ సులభమైన విషయం కాదు.

అన్ని భాషల్లోనూ సోలో రిలీజ్ దక్కితేనే ఇందుకు అవకాశాలుంటాయి. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో చాలానే జాగ్రత్తలు అవసరం. రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని.. తమిళ్ న్యూ ఇయర్ డేట్ కు గతంలో మార్చారు. ఇప్పుడు ఏప్రిల్ 27న 2.ఓ మూవీ రిలీజ్ అవుతుందనే టాక్.. టాలీవుడ్ లో గుబులు రేపింది. ఇందుకు కారణం.. అదే రోజున మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను మూవీని విడుదల చేయాలని షెడ్యూల్ చేశారు. అంతకు ముందే ఆ డేట్ ను బన్నీ సినిమా నా పేరు సూర్య కోసం ప్రకటించారు.

ఇప్పుడు 2.ఓ కారణంగా కన్ ఫ్యూజన్ నెలకొనడంతో.. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న సునీల్ నారంగ్ దగ్గరకు వెళ్లారట మహేష్.. అల్లు అర్జున్ లతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు. 2.ఓ ప్రొడ్యూసర్స్ అయిన లైకా ప్రొడక్షన్స్ ను సంప్రదించగా.. ఏప్రిల్ 27 డేట్ ను కన్ఫాం చేశారట. దీంతో రజినీ చిత్రానికి దారి ఇవ్వడం కోసం.. ఇద్దరూ రేసు నుంచి తప్పుకోవడం ఖాయమైపోయింది.

మహేష్ మూవీ రెండు వారాలు ముందుకు జరిగి ఏప్రిల్ 13నే రిలీజ్ చేస్తారట. అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్యను మేలో విడుదల చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి రజినీకాంత్ డబ్బింగ్ సినిమా కారణంగా.. రెండు భారీ స్ట్రెయిట్ చిత్రాలు డేట్ మార్చుకోవాల్సి వచ్చింది.