Begin typing your search above and press return to search.
మహేష్ బన్నీల ఫైట్ ఫిక్సే కానీ
By: Tupaki Desk | 14 Aug 2019 5:29 AM GMTగత ఏడాది భరత్ అనే నేను - నా పేరు సూర్య ఒకేసారి క్లాష్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు రెండు సినిమాల నిర్మాతలు ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి తేదీలు అనుకూలంగా మార్చుకుని అల్లు అర్జున్ మూవీ రెండు వారాలు వాయిదా వేయడం వల్ల మహేష్ బన్నీల స్ట్రెయిట్ బాక్స్ ఆఫీస్ ఫైట్ తప్పించారు. కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం ఈ పోటీ తప్పడం లేదు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో(ప్రచారంలో ఉన్న టైటిల్)చాలా తక్కువ గ్యాప్ తో వచ్చే జనవరి రేస్ లో పోటీ పడబోతున్నాయి.
ఒకే రోజు కాదు కానీ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రాబోతున్నాయని టాక్. ముందు సరిలేరు నీకెవ్వరు జనవరి 10న వస్తే ఆ తర్వాత 14న బన్నీ సినిమా వస్తుందన్న మాట. ఏడాది మొత్తం మీద వచ్చే అతి పెద్ద పండగా సీజన్ కాబట్టి ఎంత పెద్ద స్టార్ హీరోలు పోటీ పడినా కలెక్షన్లకు వచ్చిన లోటేమి ఉండదు. అందులోనూ నాలుగు రోజుల గ్యాప్ అంటే చాలా రీజనబుల్
ఇక వీటి మధ్య రజనీకాంత్ దర్బార్ కూడా వస్తుంది. అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు కాని యావరేజ్ గా అనిపించిన పేట ఈ ఏడాది తమిళ్ వెర్షన్ ద్వారా వంద కోట్లు రాబట్టడానికి కారణం కేవలం పొంగల్ హాలిడేస్ కావడమే. అందుకే ఆ ఛాన్స్ వదిలేందుకు నిర్మాతలు రెడీగా లేరు. రజని తెలుగు మార్కెట్ ఇప్పుడు దారుణంగా ఉన్నా దాన్నేమి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న రీతిలో సదరు నిర్మాణ సంస్థ ఆలోచన ఉన్నట్టుగా చెన్నై టాక్.
అదే జరిగితే మహేష్ - రజని - బన్నీల మధ్య ఫైట్ ఫిక్స్ అయినట్టే. మధ్యలో ఇంకో రెండు సినిమాలు వచ్చే ఛాన్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి కాని ఇంత పెద్ద స్టార్ క్లాష్ లో తలదూర్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే బెటర్